తీహార్ జైల్లో చిద్దూను కలిసిన సోనియా, మన్మోహన్ సింగ్

Sonia Gandhi and Manmohan Singh meet Chidambaram, తీహార్ జైల్లో చిద్దూను కలిసిన సోనియా, మన్మోహన్ సింగ్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో రిమాండ్‌‌లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా చిదంబరంతో వారు పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఈడీ, సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్ట్ 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 5 నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు.  చిదంబరం బెయిల్ పిటిషన్ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో సోనియా, మన్మోహన్ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా సోనియా, మన్మోహన్‌లను కలిసిన తరువాత చిదంబరం అధికారిక ట్విట్టర్‌ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. అందులో నా తరఫున నా కుటుంబ సభ్యులను ఈ ట్వీట్ చేయమని చెప్పాను. బంగారు రెక్కలు వచ్చి చందమామ మీదకు ఎగిరిపోవాలని నేను అనుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు. కానీ నేను సురక్షితంగా ల్యాండ్ అవుతా అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *