‘ఇది ద్రోహమే’, మోదీ ప్రభుత్వంపై సోనియా ఫైర్

రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దుయ్యబట్టారు. సకాలంలో నిధులను విడుదల చేయక పోవడంవల్ల అనేక రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో..

'ఇది ద్రోహమే', మోదీ ప్రభుత్వంపై సోనియా ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2020 | 8:37 PM

రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దుయ్యబట్టారు. సకాలంలో నిధులను విడుదల చేయక పోవడంవల్ల అనేక రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్నాయని అన్నారు . ఇది మోదీ ప్రభుత్వ ద్రోహ చర్యే అని ఆమె మండిపడ్డారు. తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. 2017 జులై 1 న జీఎస్టీ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి  మొదటి ఐదేళ్లలో ఆయా రాష్ట్రాలకుఎదురయ్యే  రెవెన్యూ నష్టాలకు గాను పరిహారం చెల్లింపులు జరిగేలా ఈ చట్టం నిర్దేశిస్తోంది. అంటే 2022 వరకు ఆదాయంలో ఎంత నష్టం వఛ్చినా  పరిహారాన్ని కేంద్రం చెల్లించ వలసి ఉంటుంది. కానీ పలు రాష్ట్రాలు దీనికి నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే సోనియా.. కేంద్రం చర్యను తప్పు పట్టారు. కరోనా వైరస్ అంటూ ప్రభుత్వం తన తప్పిదాన్ని కప్పి పుచ్చుకోజాలదన్నారు.