లండన్ చెక్కేసిన బాలీవుడ్ భామ.. అందుకేనా..!

అనిల్ కపూర్ నట వారసురాలు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ లండన్ చెక్కేసింది. ప్రపంచం మొత్తం కరోనా​తో వణికిపోతున్న సమయంలో ఈ బాలీవుడ్​ ముంబైని వదిలి లండన్ కు చేరింది‌‌. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లండన్ ఐ యమ్ బ్యాక్ అంటూ మెసెజ్ పెట్టింది. మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించకముందే భర్త పారిశ్రామిక వేత్త ఆనంద్​ అహుజాతో కలిసి సోనమ్​ ఢిల్లీ చేరుకుంది. అనంతరం జూన్ ​9న సోనమ్​ […]

లండన్ చెక్కేసిన బాలీవుడ్ భామ.. అందుకేనా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 7:20 PM

అనిల్ కపూర్ నట వారసురాలు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ లండన్ చెక్కేసింది. ప్రపంచం మొత్తం కరోనా​తో వణికిపోతున్న సమయంలో ఈ బాలీవుడ్​ ముంబైని వదిలి లండన్ కు చేరింది‌‌. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లండన్ ఐ యమ్ బ్యాక్ అంటూ మెసెజ్ పెట్టింది.

మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించకముందే భర్త పారిశ్రామిక వేత్త ఆనంద్​ అహుజాతో కలిసి సోనమ్​ ఢిల్లీ చేరుకుంది. అనంతరం జూన్ ​9న సోనమ్​ పుట్టిన రోజుకు ఒకరోజు ముందు ఈ దంపతులు ముంబయికి వచ్చారు. అదే సమయంలో లాక్​డౌన్​తో పాటు అన్ని ప్రయాణాలపై నిషేధంతో నగరంలోనే ఉండాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, బంధువులు అక్కడే ఉండటం వల్ల లండన్ కు వెళ్లిపోయింది. ​