Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

అమ్మపిలుపుతో ప్రాణం పోసుకున్నాడు..

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తర్వాత.. అమ్మ పిలుపుతో కుమారుడు లేచిన ఘటన సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని ఆ తల్లి తల్లడిల్లింది. విలపిస్తూనే ఆ కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అమ్మ విలపిస్తున్న ఆ శబ్ధానికి ఆ కొడుకు కళ్ళలోంచి నీళ్లు కారడాన్ని గుర్తించిన స్థానికులు ఆర్‌ఎంపీని పిలిపించి నాలుగైదు రోజులు వైద్యం అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మ ప్రేమే పునర్జన్మ నిచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పిల్లలమర్రి గ్రామానికి చెందిన సైదమ్మకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తానే ఇంటి పెద్ద అయి పిల్లలిద్దరిని చదివించుకుంటోంది. చిన్న కుమారుడు కిరణ్‌కు జూన్ 26న వాంతులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని.. బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న బంధుమిత్రులు అంత్యక్రియలు చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. తన కొడుకు ఇక లేడని తల్లి సైదమ్మ గట్టిగా ఏడవడంతో.. ఆ పిలుపుకు అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో కిరణ్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేసి.. చికిత్స అందించారు. చనిపోయాడు అనుకున్న కొడుకు బతకడంతో.. కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.