Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

దారుణం: రిమోట్ కోసం.. తండ్రినే చంపేశాడు..!

ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారు. టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కాలక్షేపం కోసం ఉపయోగించే వాటితో కాలం గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో పబ్ జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నాడని కన్నతండ్రినే ముక్కులుగా నరికి హతమార్చాడు ఓ యువకుడు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో యువకుడు రిమోట్ కోసం గొడవపడి.. కన్నతండ్రినే చంపేశాడు. నల్గొండ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెరుమాళ్ల గోవర్ధన్, అతని కొడుకు సతీష్‌తో కలిసి నల్గొండ జిల్లాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గోవర్ధన్ కూలి పనులకు వెళుతుంటాడు. సతీష్ అదే జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో టీవీ రిమోట్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న సతీష్ ఆవేశం పట్టలేక రోకలిబండతో తండ్రి తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి తండ్రి మృతి చెందాడు. అది తెలియని సతీష్.. రక్తపు మడుగులో ఉన్న తండ్రి పక్కనే పడుతున్నాడు. ఉదయం లేచే సమయానికి తండ్రి చనిపోయి ఉండటంతో స్థానికులకు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా టీవీ రిమోట్ విషయంలో తండ్రి, కొడుకులిద్దరికీ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక రాత్రి కూడా అదే విషయంలో గొడవపడి ఉంటారని పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.