సోలో బ్రతుకే సో బెటరు ఫినీష్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటరు'. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సాయితేజ్ ప్రకటించాడు. యూనిట్ సభ్యులతో దిగిన గ్రూప్ ఫొటో తన అభిమానులతో పంచుకున్న సాయితేజ్..

సోలో బ్రతుకే సో బెటరు ఫినీష్
Follow us

|

Updated on: Sep 11, 2020 | 1:46 PM

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటరు’. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సాయితేజ్ ప్రకటించాడు. యూనిట్ సభ్యులతో దిగిన గ్రూప్ ఫొటో తన అభిమానులతో పంచుకున్న సాయితేజ్.. షూటింగ్ ఎలా జరిగిందో చెప్పుకొచ్చాడు. ఎంతో సరదా సరదాగా సినిమా షూటింగ్ అయిందని.. సెట్స్ లో ఎప్పుడూ ఎవ్వరూ నీరసంగా కనిపించిన సందర్భమేలేదని సాయితేజ్ చెప్పాడు. అయితే, లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ఇటీవల షూటింగ్ ప్రారంభించి మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ముగించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.