పుల్వామా మళ్ళీ ఉద్రిక్తం.. జవాన్ మృతి.. ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం తుపాకులు గర్జించాయి. ఈ జిల్లాలోని గూసు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక జవాను మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ఓ ఇంట్లో దాక్కున్న..

పుల్వామా మళ్ళీ ఉద్రిక్తం.. జవాన్ మృతి.. ఉగ్రవాది హతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 9:48 AM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం తుపాకులు గర్జించాయి. ఈ జిల్లాలోని గూసు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక జవాను మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులపై భద్రతా దళాలు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది మృతి చెందాడు. సీఆర్పీఎఫ్, 183 బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అనంత నాగ్ జిల్లాలో ఓ జవానును, ఆరేళ్ళ బాలుడిని హతమార్చిన ఓ ఉగ్రవాది గతవారం శ్రీనగర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో మరణించాడు. జహీద్ దాస్ అనే ఈ టెర్రరిస్టు కోసం భద్రతా దళాలు గత నెల 26 న తీవ్రంగా గాలించాయి. అటు-జూన్ నెలలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 48 మంది ఉగ్రవాదులు మరణించారు.