Breaking News
  • అమరావతి: పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీ నేడు శ్రీకారం . నేటి నుండి 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం .క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్ .రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు లబ్ది .వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు .5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు .దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం . శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా.
  • కృష్ణాజిల్లా : 29 మంది క్రికెట్ బుకీల అరెస్టు. విస్సన్నపేట మండలం కొర్ర తండా లో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు. 29 మందిని అదుపులోకి తీసుకొని ఒక టీవీ సెల్ఫోన్లు .2000/-రూ..స్వాధీనం చేసుకున్న పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామంటున్న Si లక్ష్మణ్.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అప్డేట్: శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి,సాయికృష్ణ రెడ్డి ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు. శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు.. శ్రావణి కి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలు సేకరించారు.. కస్టడీ ముగియడంతో ఈరోజు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నా పోలీసులు.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది. యువకుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది

స్టూడెంట్‌పై 14 మంది అసహజ లైంగిక దాడి…చివరకు

Maharashtra: Sodomised Boy Hangs Self in Chandrapur 14 Hostel Mates Arrested, స్టూడెంట్‌పై 14 మంది అసహజ లైంగిక దాడి…చివరకు

రేపటితరం భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంతగా అభివృద్ది చెందుతున్నామో, మానసికంగా అంతకంటే దిగజారిపోతున్నాం. కౌమార దశలో యువతకు కౌన్సిలింగ్ అవసరం. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ఇద్దరూ వారిలో మానసిక పరివర్తన దిశగా బీజాలు వేయాలి. కేవలం చదువులు చాలనే భావన ఎంతమాత్రం కరెక్ట్ కాదు. లేకపోతే విపరీత పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సంఘటననే మీకు వివరించబోతున్నాం.

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి చంద్రాపూర్‌లోని సేవాదళ్ వసతి గృహంలో ఉంటూ ఓ కుర్రాడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆ హాస్టల్ అతనితో పాటు ఉండే కొందరు విద్యార్థులు అతనిపై అసహజ లైంగిక దాడికి పాల్పాడ్డారు. గత కొన్ని నెలలుగా అతనికి టార్చర్ చూపిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోవాలే అర్థం కాక మౌనంగానే సదరు విద్యార్థి ఆ బాధను భరించాడు. కానీ వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఇక చావే శరణ్యం అనుకున్నాడు. తన మన వేదనను 18 పేజీల లేఖలో రాసి..ఉరివేసుకుని తనువు చాలించాడు. జనవరి 18న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వాచ్‌మెన్‌తో పాటు 14 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.

 

Related Tags