Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

సోషల్ మీడియా వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్..!

Good News To Social Media Users Says Centre, సోషల్ మీడియా వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా యూజర్స్‌లో తలెత్తిన ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రం చెక్ పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ యూజర్లు పెరిగారని.. వారికి చెక్ పెట్టాలంటే.. సోషల్ మీడియా అకౌంట్స్‌కు ఆధార్ లింక్ చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ తప్పదేమోనని వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై కేంద్రం పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయాలన్న ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఆధార్‌కు సంబంధించిన సమాచారం కూడా పూర్తి సురక్షితంగా ఉందని.. రెగ్యులర్‌గా ఆడిట్ కూడా జరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఓ ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఐటీ చట్టం 2000లోని సెక్షన్‌ 69ఏ కింద ప్రజా ప్రయోజనాల కోసం.. కొన్ని (అనుమానిత, వివాదాస్పద) అకౌంట్స్‌ను తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 2016 నుంచి 2019 వరకు దాదాపు తొమ్మిది వేల అకౌంట్ల యూఆర్ఎల్‌లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు.