బ్రేకింగ్: ఆగిన Gmail సేవలు.. ట్విట్టర్‌లో ఫిర్యాదులు

ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ జీమెయిల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతరాయం కలిగింది. తమ మెయిల్‌‌లు పనిచేయడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మెయిల్ పంపుకోవడం, వచ్చినవి చూడటం సహా ఇతర చర్యల్లో ఈ ఇబ్బంది తలెత్తిందని వారు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సమస్య పర్సనల్ ఖాతాల కంటే బిజినెస్ ఖాతాల్లోనే ఎక్కువగా ఉందని సమాచారం. అయితే గూగల్ క్లౌడ్‌ ఇబ్బందితోనే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. […]

బ్రేకింగ్: ఆగిన Gmail సేవలు.. ట్విట్టర్‌లో ఫిర్యాదులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2019 | 5:13 PM

ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ జీమెయిల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతరాయం కలిగింది. తమ మెయిల్‌‌లు పనిచేయడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మెయిల్ పంపుకోవడం, వచ్చినవి చూడటం సహా ఇతర చర్యల్లో ఈ ఇబ్బంది తలెత్తిందని వారు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సమస్య పర్సనల్ ఖాతాల కంటే బిజినెస్ ఖాతాల్లోనే ఎక్కువగా ఉందని సమాచారం. అయితే గూగల్ క్లౌడ్‌ ఇబ్బందితోనే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. మరోవైపు దీనిపై స్పందించిన గూగుల్.. సమస్యను పరిష్కరించి, సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కాగా ఈ ఏడాదిలో ఆ మధ్యన ఫేస్‌బుక్ సహా పలు యాప్‌ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే.