కన్నీరు పెడుతున్న సోషల్ మీడియా

శోక సంద్రంలో సోషల్ మీడియా చూస్తున్నంతసేపూ ఆగని ఆవేదన న్యూఢిల్లీ: ఖబడ్దార్ పాకిస్థాన్. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మర్చిపోలేని గుణపాఠం చెబుతాం. బదులు తీర్చుకుంటాం. మా జవాన్ల ప్రాణ త్యాగాలను వృధా కానివ్వం. ఈ మాటలన్నీ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వినిపిస్తున్నవి. 42 మంది వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియా అయితే కన్నీరు కారుస్తుంది. జవాన్లపై ఉన్న అభిమానం […]

కన్నీరు పెడుతున్న సోషల్ మీడియా
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:14 PM

  • శోక సంద్రంలో సోషల్ మీడియా
  • చూస్తున్నంతసేపూ ఆగని ఆవేదన

న్యూఢిల్లీ: ఖబడ్దార్ పాకిస్థాన్. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మర్చిపోలేని గుణపాఠం చెబుతాం. బదులు తీర్చుకుంటాం. మా జవాన్ల ప్రాణ త్యాగాలను వృధా కానివ్వం. ఈ మాటలన్నీ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వినిపిస్తున్నవి. 42 మంది వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

సోషల్ మీడియా అయితే కన్నీరు కారుస్తుంది. జవాన్లపై ఉన్న అభిమానం చాటుతూ ముష్కరులపై ఆగ్రహం చూపిస్తూ దద్దరిల్లుతోంది. ఖబడ్దార్ పాకిస్థాన్ అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బకుదెబ్బతీయాల్సిందే అంటున్నారు. వీరి స్పందనకు రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖ సెలబ్రిటీల స్పందన తోడవడంతో వారి మాటలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వేడి పెంచుతున్నారు.

కొన్ని సోషల్ మీడియా పోస్టింగులైతే కంటితడి పెట్టించేలా ఉంటున్నాయి. పలువురు దేశాభిమానంతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగులు చూస్తున్నంత సేపూ తమకు కళ్ల చమ్మ ఆగడంలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.