భారత్‌కు సారీ చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం.. ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని లిఖితపుర్వక హామీ

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ భారత్‌కు క్షమాపణ చెప్పింది. లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు కోరింది. తమ తప్పును ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వివరించింది.

  • Sanjay Kasula
  • Publish Date - 10:50 pm, Wed, 18 November 20
భారత్‌కు సారీ చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం.. ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని లిఖితపుర్వక హామీ

Twitter Has Apologised : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ భారత్‌కు క్షమాపణ చెప్పింది. లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు కోరింది. తమ తప్పును ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వివరించింది. దీనిపై జేపీసీ ఛైర్‌పర్సన్‌ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. లద్దాఖ్‌ను చైనాలో చూపినందుకు ట్విటర్‌ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిందన్నారు.

భారత చిత్రపటాన్ని తప్పుగా జియో ట్యాగ్‌ చేసినందుకు క్షమాపణ కోరుతూ ట్విటర్‌ ఇండియా మాతృసంస్థ ట్విటర్‌ ఐఎన్‌సీ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ డమైన్‌ కరియన్‌ అఫిడవిట్‌ రూపంలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్టు మీనాక్షి లేఖి తెలిపారు.

భారతీయుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరారని, ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని చెప్పిందని మీనాక్షి లేఖి వెల్లడించారు.