Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

మునిసి‘పోల్స్‌‘లో హైటెక్ ప్రచారం

high-tech campaign in elections, మునిసి‘పోల్స్‌‘లో హైటెక్ ప్రచారం

మునిసిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు హైటెక్ బాట పట్టాయి. ప్రచారం స్టైల్‌ను మార్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నేతలకు పెద్దగా పని ఉండదు. అంతా లోకల్‌ వ్యవహారాలు చక్కబెట్టాలి. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు టెక్నాలజీని వాడుతున్నాయి. కార్యకర్తలు,నేతలను సమరోత్సాహానికి రెడీ చేస్తున్నాయి.

మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీలు కొత్త ప్రచార ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. ఇన్నాళ్లు రోడ్‌షోలు, బహిరంగసభలతో అదరగొట్టిన నేతలు ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే తెలంగాణలో అన్ని చానళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మునిసిపల్ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌లో జోష్ నింపారు. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళతామో స్పష్టం చేశారు.

మునిసిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వమించారు. అభ్యర్థుల ప్రచార తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా నిర్వహించాలి? ఓటర్లను ఎలా కలవాలి? అనే విషయాలపై అభ్యర్థులకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు.

కొన్ని జిల్లాలో ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి కేటీఆర్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, రామగుండం, మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో పాటు మహిళ అభ్యర్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. స్థానికంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఇటు కాంగ్రెస్‌ కూడా సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ చేపట్టింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫేస్‌బుక్‌ లైవ్‌లో కార్యకర్తలతో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా నేతలకు ప్రచారంలో తీసుకున్న జాగ్రత్తలను సూచించారు. మొత్తానికి ప్రధాన పార్టీలు సోషల్‌ మీడియా బాట పట్టాయి. రాబోయే ఎన్నికల ట్రెండ్‌ను చెప్పకనే చెప్పాయి.

Related Tags