ఇక ఫేస్ బుక్, ట్విట్టర్‌ సామాజిక మాధ్యమాలకు ఆధార్ సీడింగ్..!

Social Media Accounts Should be Aadhaar-Linked in 'National Interest': Govt's Top Law Officer Tells SC, ఇక ఫేస్ బుక్, ట్విట్టర్‌ సామాజిక మాధ్యమాలకు ఆధార్ సీడింగ్..!

సామాజిక మాధ్యమాల అకౌంట్ లకు ఆధార్‌ అనుసంధానంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మద్రాస్ హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఫేస్‌బుక్ పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్న పిటిషన్లను బదిలీ చేసి సుప్రీంకోర్టు పరిధిలోకి తేవాలని ఫేస్‌బుక్ కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్లు బదిలీ చేయాలన్న ఫేస్‌బుక్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్‌, ఫేస్‌బుక్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి చేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఆధార్ అనుసంధానిస్తే తప్పుడు ఖాతాలు గుర్తింపు సులభమవుతుందని ప్రభుత్వం తరఫున ఏజీ వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. కేంద్ర అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వ్యతిరేకిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *