ఇంకెక్కడి భౌతిక దూరం ? కర్నాటక మంత్రి ఊరేగింపులో జన సంద్రం !

ఈ కరోనా కాలంలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు సపోర్టర్లు.. అసలు భౌతిక దూరం రూల్ ఒకటుందనే విషయమే మరిచినట్టున్నారు. ఆయన ఓపెన్ ట్రక్కులో ప్రయాణిస్తుండగా..

ఇంకెక్కడి భౌతిక దూరం ? కర్నాటక మంత్రి ఊరేగింపులో జన సంద్రం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2020 | 7:01 PM

ఈ కరోనా కాలంలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు సపోర్టర్లు.. అసలు భౌతిక దూరం రూల్ ఒకటుందనే విషయమే మరిచినట్టున్నారు. ఆయన ఓపెన్ ట్రక్కులో ప్రయాణిస్తుండగా.. వందలకొద్దీ అభిమానులు, మద్దతుదారులు పొలోమంటూ ఆ వాహనంవెంట బడ్డారు. పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ.. గుంపులు..గుంపులుగా… తమ ‘స్వామి భక్తి’ని చాటుకునేందుకు ‘సోషల్ డిస్టెన్స్’ ని ‘అపహాస్యం’ చేశారు. శ్రీరాములు వెంట స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి కూడా ఉన్నారు. ఇంకేం ? ఆయన మద్దతుదారులు కూడా వీరితో కలిసిపోయారు. చిత్రదుర్గ లోని వేదాంతి నది వద్ద ‘బగీనా’ పేరిట ఏటా జరిగే కార్యక్రమానికి ఈ మంత్రిగారు, ఎమ్మెల్యే  గారు తమ వందిమాగధులతో సహా వెళ్తుండగా కనబడిన దృశ్యమిది !

లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మతపరమైన కార్యక్రమాలను అనుమతించింది. అయితే ప్రతివారూ సోషల్ డిస్టెన్స్ ను పాష్టించాలని, తరచూ హ్యాండ్ వాషింగ్ కూడా తప్పనిసరి అని పేర్కొన్నా.. ఇలాంటి ‘భజన కార్యక్రమాల్లో’ వాటిని పాటిస్తున్నదెవరు..ఇక మంత్రి  శ్రీరాములు మాత్రం తమవాళ్లకు ఈ రూల్స్ గురించి చెబుతూనే ఉన్నానని, కానీ వారు పాటించకపోతే ఏం చేయాలని  ప్రశ్నించారు..’చూడండి ! నేను మాస్క్ లాగా ఈ టవల్ వంటి బట్టను నా ముఖానికి చుట్టుకున్నాను.. మీరే చూస్తున్నారుగా’ అని వ్యాఖ్యానించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.