Traffic Challans: మంత్రుల కార్లపై భారీగా ట్రాఫిక్ చలాన్లు

రోడ్లపై కాస్త స్పీడ్ దాటితేనే.. ఇలా క్లిక్ మనిపించి.. వేలకు వేల ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన..

Traffic Challans: మంత్రుల కార్లపై భారీగా ట్రాఫిక్ చలాన్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 4:55 PM

Many Traffic Challans pending on TS Minister Vehicles: రోడ్లపై కాస్త స్పీడ్ దాటితేనే.. ఇలా క్లిక్ మనిపించి.. వేలకు వేల ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లఘించినందుకు తెలంగాణ మంత్రుల కార్లపై కూడా భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదవుతున్నాయి. అవి సంవత్సరాల తరబడి నుంచి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ చలాన్లు కావడమే గమనార్హం.

వారిలో మంత్రి జగదీష్ రెడ్డి కార్‌పై 9 అత్యధికంగా ట్రాఫిక్ చలానాలతో రూ.9,315 జరిమాన నమోదవ్వగా, ఈటల రాజెందర్ 6 చలాన్లకు గానూ 6,210ల ఫైన్ ఉంది, కొప్పుల ఈశ్వర్ 5 చలాన్లకు రూ.5,175లు ఉంది. సబితా ఇంద్రా రెడ్డి సొంత వాహనంపై 5లకు రూ.2,775 జరిమానా ఉంది. ఇక గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్ వాహనాలపై 3 చలాన్లు ఉండగా, శ్రీనివాస్ గౌడ్ వాహనంపై రెండు చలాన్లు నమోదయ్యాయి. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి. అయితే.. వారు మంత్రులు కావడంతో రూల్స్ బ్రేక్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.