ఎదురుగా 23 అడుగుల అనకొండ.. మనోడు ఏం చేశాడంటే..!

diver comes face to face with anaconda, ఎదురుగా 23 అడుగుల అనకొండ.. మనోడు ఏం చేశాడంటే..!

చిన్న పాము కనిపిస్తేనే.. ‘‘ఇవాళ మనం అయిపోయామురోయ్’’ అనుకొని వెంటనే గట్టిగా అరుస్తూ.. ఉరుకులు, పరుగులు పెడతాము. అలాంటిది 23 అడుగుల అనకొండ ఎదురైతే.. అమ్మో ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా..! అలాంటి సీన్ సినిమాలో వస్తేనే మన గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అలాంటిది ఓ స్కూబా డైవర్ పెద్ద సాహసమే చేశాడు. తన ధైర్యాన్నంతా కూడగట్టుకొని ఆ అనకొండ కదలికలను తన కెమెరాలో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బ్రెజిల్‌కు చెందిన బార్టోలోమియో బోవ్, జుకా గరాపే అనే ఇద్దరు ప్రొఫెషనల్‌ స్కూబా డైవర్లు ఈ జూలైలో ఫొర్మోసో నదిలోకి దిగారు. అక్కడ వారు డైవింగ్ చేస్తున్న సమయంలో 23 అడుగుల అనకొండ కనిపించింది. వెంటనే దాన్ని తన కెమెరాలో బంధించాడు బోవ్. ఆ సమయంలో ఆ అనకొండ పలుమార్లు అతడి కెమెరా దగ్గరగా కూడా వచ్చింది. అయితే ఏ మాత్రం బెదరిని బోవ్.. ఆ అనకొండ ఎటు వెళ్తే అటుగా వెళ్లి వీడియోను తీశాడు.

ఆ తరువాత దీని గురించి బోవ్ మాట్లాడుతూ.. అనకొండలు మనుషులు అనుకున్నంత క్రూర జీవులు కాదని అన్నాడు. నదిలో ఈ అనకొండ చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉందని.. కొన్ని సార్లు తన కెమెరాకు దగ్గరగా వచ్చిందని చెప్పుకొచ్చారు. సాధారణంగా అనకొండలు మనుషులకు హాని చేస్తాయని మనం అనుకుంటామని.. కానీ ఈ అనకొండ ప్రవర్తన ఆ అపోహను తొలగించిందని బోవ్ తన అనుభవాలను తెలిపారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో బతికున్న అనకొండలలో ఇదే పెద్దదని.. దీని బరువు దాదాపు 90కేజీల వరకు ఉండొచ్చని బోవ్ తెలిపారు. కాగా ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు.. ‘‘ఓరి నాయనో.. నీకు ధైర్యం ఎక్కువేనయ్యా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *