ఈ పాముకు నాలుగు కాళ్లు..కుమురం భీం జిల్లాలో విచిత్రం..అధికారులు ఏం చెప్పారంటే

కుమురం భీం జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో విచిత్ర ప్రాణి దర్శనమిచ్చింది. పామును పోలి ఉండి నాలుగు కాళ్లు కలిగి ఉండటంతో స్థానికులు ఆ జీవిని చూడటానికి పరుగులుపెట్టారు. 

ఈ పాముకు నాలుగు కాళ్లు..కుమురం భీం జిల్లాలో విచిత్రం..అధికారులు ఏం చెప్పారంటే
Follow us

|

Updated on: Nov 20, 2020 | 3:35 PM

కుమురం భీం జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో విచిత్ర ప్రాణి దర్శనమిచ్చింది. పామును పోలి ఉండి నాలుగు కాళ్లు కలిగి ఉండటంతో స్థానికులు ఆ జీవిని చూడటానికి పరుగులుపెట్టారు.   గ్రామానికి చెందిన బండి లచ్చన్న.. ఇంట్లో పనులు చేసుకుంటుండగా పాము లాంటి ఓ ప్రాణి కనిపించింది. రెండు అడుగుల పొడవు కలిగిన ఆ జీవిని అతను పరీక్షగా చూడగా నాలుగు కాళ్లు కనిపించాయి. దీంతో లచ్చన్న భయాందోళనకు గురై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందించారు.

ఆ జీవిని పరిశీలించిన అధికారులు.. కాళ్లు కలిగిన పాము లాంటి జీవులు అరుదుగా ఉంటాయని, ఇవి సాధారణంగా అడవుల్లో ఉంటాయని తెెలిపారు. దారితప్పి నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు. దీనిని కామన్ స్నేక్ అంటారని వివరించారు.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..