Breaking News
  • విజయవాడ: దుర్గగుడి లో వెండి రధం లో మూడు సింహాలు చోరీ. రధానికి నాలుగు వైపులా‌ ఉన్న మూడు వెండి సింహాలు మాయం. మూడు సింహాలను ఎత్తుకెళ్ళి నాలుగో సింహం కాలిని కట్ చేసినట్లుగా ఆనవాళ్ళు. రధానికి సెక్యురిటీ కల్పించే విషయంలో పరదా ఇప్పడంతో బయటపడిన సింహాలు మాయమైన ఘటన. విషయాన్ని గోప్యంగా ఉంచిన దుర్గగుడి అధికారులు. లాక్ డౌన్ ముందే జరిగిందా లేదా లాక్ డౌన్ సమయంలో ఎప్పుడు జరిగిందా అనేది సిసి కెమేరా వెతుకులాటలో దుర్గగుడి అధికారులు . రధానికున్న వెండి సింహం బొమ్మల చోరీని ఖండించిన ఈవో సురేష్ బాబు . ఏడాది నుంచి రధం బయటకు తీయకపోవడంతో చోరీ జరిగిందా లేక స్టోర్ రూంలో ఉందా అనేది రికార్డ్స్ పరిశీలిస్తామన్న ఈవో . పూర్తి విచారణ జరిపే యోచనలో దుర్గగుడి అధికారులు.
  • ఉత్తర్వులు జారీ: వాణిజ్యపన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పరిధిలో కొత్తగా 18 సర్కిళ్ల ఏర్పాటు. వివిధ విభాగాల్లో 161 పోస్టుల సృష్టి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
  • విజయవాడ: ఎస్సై నకిలీ ఫేస్ బుక్ ఐడీతో మోసం. జయన్న అనే సబ్ ఇన్ స్పెక్టర్ పేరుతో కేటుగాళ్ళు నకిలీ ఫేస్ బుక్ ఐడి. హెడ్ కానిస్టేబుల్ గురుప్రసాద్ ను బురిడీ కొట్టించి లక్ష రూపాయలు వసూలు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానాయక్ నగర్ లో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. అర కోటి సంఖ్యను దాటిన మొత్తం కేసులు. 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసులు: దేశవ్యాప్త మొత్తం కేసుల సంఖ్య: 50,20,360. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్త మరణాలు: 1,209. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య: 82,066. 24 గంటల్లో డిశ్చార్జయినవారి సంఖ్య: 82,961. దేశవ్యాప్తంగా డిశ్చార్జయిన మొత్తం కేసులు: 39,42,360. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య: 9,95,933.
  • అప్పటి జిన్నారం డిప్యూటీ తహసీల్దారుపైనా వేటు. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు కట్టబెట్టడంతో చర్యలు. మరికొందరు సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలకు రంగం సిద్ధం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తహసీల్దారుగా పనిచేసిన సమయంలో దస్త్రాలను మార్చి ఖాజీపల్లిలోని కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి కట్టబెట్టిన వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందనే నివేదిక ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు.
  • కడపజిల్లా: ముద్దనూరు కాల్వ లో పడి విఆర్ఏ,వాలంటీర్ సూసైడ్. చనిపోయిన వ్యక్తి పులివెందుల కి చెందిన పారి కార్తిక్ గా గుర్తింపు. అనంతపురం జిల్లా మర్రి కొమ్మ దీన్నే గ్రామం,N.p కుంట మండలం చెందిన కవిత గా గుర్తింపు. మర్రికొమ్మదిన్నె గ్రామంలో VRA గా కార్తిక్ గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. చనిపోయిన కవిత వివాహిత.ఈమె వాలెంటిర్ గా మర్రికొమ్మ దీన్నే లోనే వాలంటీర్ గా పని చేస్తూ ఉన్నది. కవిత భర్త కువైట్ లో ఉండడం తో, కార్తీక్ , కవిత ఇద్దరు సన్నిహితంగా వుండే క్రమంలో ఇద్దరు ప్రేమించు కొనే వారని పోలీసులు సమాచారం.

‘పెళ్లికొచ్చిన చిన్నది, చీరలోనే పామును పట్టేసింది’ !

తమ బంధువుల పెళ్ళికి ఎంచక్కా చీరలో ముస్తాబై వచ్చింది ఆమె . అంతా పెళ్లి హడావుడిలో  ఉండగా ఎక్కడినుంచీ వచ్చిందోగానీ ఓ పాము వఛ్చి పెళ్ళివారి వంటింట్లో దూరింది. ..
Snack Catcher, ‘పెళ్లికొచ్చిన చిన్నది, చీరలోనే పామును పట్టేసింది’ !

తమ బంధువుల పెళ్ళికి ఎంచక్కా చీరలో ముస్తాబై వచ్చింది ఆమె . అంతా పెళ్లి హడావుడిలో  ఉండగా ఎక్కడినుంచీ వచ్చిందోగానీ ఓ పాము వఛ్చి పెళ్ళివారి వంటింట్లో దూరింది. .. వంటింటి సామాన్ల మధ్య దూరిపోయింది. అది చూసి అంతా భయంతో పరుగులు తీసినా ఆ మహిళ మాత్రం అది ఎక్కడ దాక్కుందో ఇట్టే కనిపెట్టి, ఆట్టే..వట్టి చేతుల్తో పట్టేసింది. ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా దాన్ని బయటకు తీసుకువెళ్లి ఓ బట్టలో ‘బంధించింది’.. ఆవిడ స్నేక్ క్యాచరా అంటే కానే కాదు.. కానీ ఎంతో నేర్పుగా అనుభవజ్ఞురాలైనస్నేక్ క్యాచర్ మాదిరే కోబ్రాను పట్టేయడం విశేషం. ఆమె సాహసాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. కర్ణాటకలో ఆ మధ్య జరిగిన ఈ అపర ‘నాగిని’ ఉదంతం తాలూకు వీడియో వైరల్ అయింది. అన్నట్టు ఆ ‘నాగిని’ పేరు నిర్జారా చిట్టి అట ! పేరేదైతేనేం ?

Related Tags