స్మోకింగ్ చేస్తే..క‌రోనా క‌బ‌ళిస్తోందా..?

అచ్చేదిన్‌ సంగతి తర్వాత.. ఇప్పుడు కరోనాతో చచ్చేదిన్‌ చుక్కలు చూపిస్తోంది.. ఈ విపత్తు నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం లాక్‌డౌన్‌. అందరూ ఇంటిపట్టునే ఉండటమే కరోనాపై విజయం సాధించిపెట్టగల ఆయుధం. కరోనా కట్టడి సహా స్మోకింగ్‌ వంటి సోషల్‌ వైరస్‌పై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. మిత్రమా.. మరణమా…? వ్యసనాల త్యాగమా? తేల్చుకోండి… కనిపించని కరోనా వైరస్‌పై యుద్ధం సాగుతోంది. మరి కళ్ల ముందు జీవితాలకు పొగ పెడుతున్న ఈ సోషల్‌ వైరస్‌ మాటేమిటి..? ఉమ్మడి […]

స్మోకింగ్ చేస్తే..క‌రోనా క‌బ‌ళిస్తోందా..?
Follow us

|

Updated on: Mar 30, 2020 | 6:07 PM

అచ్చేదిన్‌ సంగతి తర్వాత.. ఇప్పుడు కరోనాతో చచ్చేదిన్‌ చుక్కలు చూపిస్తోంది.. ఈ విపత్తు నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం లాక్‌డౌన్‌. అందరూ ఇంటిపట్టునే ఉండటమే కరోనాపై విజయం సాధించిపెట్టగల ఆయుధం. కరోనా కట్టడి సహా స్మోకింగ్‌ వంటి సోషల్‌ వైరస్‌పై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. మిత్రమా.. మరణమా…? వ్యసనాల త్యాగమా? తేల్చుకోండి… కనిపించని కరోనా వైరస్‌పై యుద్ధం సాగుతోంది. మరి కళ్ల ముందు జీవితాలకు పొగ పెడుతున్న ఈ సోషల్‌ వైరస్‌ మాటేమిటి..? ఉమ్మడి శత్రువుగా కరోనాపై యుద్ధం సరే..! భస్మాసుర హస్తంలా కబళించే స్మోకింగ్‌ అంతు చూడలేమా? వ్యసనాలకు బ్రేక్‌డౌన్‌ కొడితే ఈ లాక్‌డౌన్‌తో అచ్చేదిన్‌ ఖాయం. గట్టిగా అనుకోండి.. సిగరేట్‌ స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పండి.. లేదంటే పొగ తాగినవాళ్లను కరోనా పగపట్టినట్టు వెంటాడుతుంది. స్మోకింగ్‌ ఉన్నవారే కరోనా వైరస్‌కు ఎక్కువగా ఎఫెక్ట్‌ అయ్యారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

కరోనా వైరస్‌ ప్రబలడానికి ముందు ఫిబ్రవరి వరకు చైనాలో 17 శాతం మంది స్మోకర్లు. కరోనాతో చనిపోయిన ప్రతి పది మందిలో ఇద్దరు స్మోకర్లు ఉన్నారు. అంటే కరోనా లాంటి వైరస్‌లు పొగరాయుళ్లను త్వరగా హత్తుకుపోతాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నివేదికల ప్రకారం ఏడుగురు అరబ్బులలో ఒకరు స్మోకింగ్‌ వల్ల చనిపోతున్నారు. స్మోకర్లలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో మన భారత్‌ ఉంది. సిగరేట్‌ తాగడం వల్ల జరిగే దుష్పరిణామాలు ఎలాంటివో అందరికి తెలిసిందే. టెన్షన్‌ రిలీఫ్‌ అవుతుందనో… కిక్కు కోసమో, దున్నపోతులం కామనే దర్జా చూపించుకోవడం కోసమో సిగరెట్‌కు బానిస అయితే బతుకు పొగచూరిపోవడం ఖాయం. సిగరెట్‌ స్మోకింగ్‌ వల్ల మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రమాదకమైన నికోటిన్‌ మెదడు, గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. పొగ తాగడం వల్ల కడుపులో మంట.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడతాయి. గులాబీరంగులో ఉండాల్సిన ఊపిరితిత్తులు మాడి నలుపురంగులోకి మారతాయి. సిగరెట్‌ స్మోకింగ్‌ వల్ల 12 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అతిగా సిగరేట్‌ తాగితే మగవాళ్లలో పురుషత్వం తగ్గిపోతుంది. పొగతాగే మహిళలకు ప్రెగ్నెన్సీలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవన్నీ అందరికి తెలిసిన నిజాలే. కరోనా వంటి వైరస్‌లు స్మోకర్లకు వెంటనే ఎఫెక్ట్‌ అవుతాయి. ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి బకెట్‌ తన్నేయడం ఖాయం. అంచేత స్మోకింగ్‌ను మానేయడానికి ఇంతకు మించిన అవకాశం మరోటి రాదు.. పొగతాగడం మానేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్