శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో నిలువ చేస్తూ రాయలసీమ పథకాలకు సరఫరా చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
Follow us

|

Updated on: Sep 10, 2020 | 7:23 PM

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో నిలువ చేస్తూ రాయలసీమ పథకాలకు సరఫరా చేస్తున్నారు. సుంకేసుల జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 98,270 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వరద పెరగడంతో శ్రీశైలం జలాశయం మూడు గేట్లను పైకెత్తి దిగువ నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో నిలువ చేస్తూ రాయలసీమ పథకాలకు నీరు అందిస్తున్నారు. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.