నితీష్ కుమార్ పై చెప్పు విసిరిన దుండగులు, నలుగురి అరెస్ట్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కొంతమంది దుండగులు చెప్పు విసిరారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Umakanth Rao
  • Publish Date - 10:39 am, Tue, 27 October 20

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కొంతమంది దుండగులు చెప్పు విసిరారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. చెప్పు ఆయనకు కొంత దూరంలో పడింది.  కాగా-పోలీసులు అప్రమత్తమై నలుగురిని అరెస్ట్ చేశారు. తన ఎన్నికల ప్రచార సభల్లో  నితీష్ కుమార్  చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ఆయన నిగ్రహాన్ని కోల్పోయి నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. తనకు ఓటు వేయకపోయినా బాధపడనని, కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని ఆయన అంటూ వచ్చారు.  ఓ ఎన్నికల ర్యాలీలో కొందరు లాలూ ప్రసాద్ యాదవ్ కి అనుకూలంగా నినాదాలు చేయడంతో నితీష్ కుమార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటీ నాన్సెన్స్ అంటూ ఆయన  రెచ్చి పోయారు.