విశాఖ మన్యం సీలేరులో భూ ప్రకంపనలు.. ఒక్కసారిగా షాక్‌కు గురైన స్థానికులు

విశాఖ మన్యం సీలేరులో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు స్థానికులను కలవరపెట్టాయి.  ఒక్కసారిగా భూమి కంపించడంతో షాక్  గురైన స్థానికులు..

  • Ram Naramaneni
  • Publish Date - 1:37 pm, Sat, 21 November 20

విశాఖ మన్యం సీలేరులో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు స్థానికులను కలవరపెట్టాయి.  ఒక్కసారిగా భూమి కంపించడంతో షాక్  గురైన స్థానికులు.. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సీలేరులో భూమి కంపించింది. స్థానిక ఎస్​ఈ , జెన్కో అపార్ట్మెంట్ల వద్ద ప్రకంపనల శబ్దాలు పెద్దగా వినిపించాయి.

 ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సీలేరులో పరిసర ప్రాంతాలతో ప్రస్తుతం భూ ప్రకంపనల గురించే చర్చ జరుగుతుంది. భూ ప్రకంపనలపై స్థానిక అధికారులు..ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. గత నెలలో హైదారాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో పలుసార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్