నిరుద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్..వివరాలు సూపర్ !

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి ఏపీలోని  నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం జగన్ అమరావతి సచివాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు. ఉద్యోగావకాశాలు కల్పించడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం.. ఆదిశగా చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం సీఎం జగన్ ఈ సమీక్షలో […]

నిరుద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్..వివరాలు సూపర్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 25, 2019 | 3:58 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి ఏపీలోని  నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం జగన్ అమరావతి సచివాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.

ఉద్యోగావకాశాలు కల్పించడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం.. ఆదిశగా చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం సీఎం జగన్ ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధికోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూనివర్శిటీ కింద ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీని స్థాపించాలని, రాష్ట్రవ్యాప్తంగా యూనివర్శిటీ పరిధిలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌కాలేజీలు స్థాపించాలని జగన్ సూచించారు.

నైపుణ్యాభివృద్ధికోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణనిచ్చే బాధ్యతలను యూనివర్శిటీలకు అప్పగించాలని ఆదేశించారు. చదువు పూర్తిచేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దగ్గాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని సీఎం ఈ సమీక్ష సందర్బంగా వెల్లడించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్‌ సౌకర్యం కల్పించాలని, అప్రెంటిస్‌ అయ్యాక ఇంకా శిక్షణ అవసరమనుకుంటే.. మళ్లీ నేర్పించాలని, ఆతర్వాతే పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నెలరోజుల్లోగా కార్యచరణకు సీఎం ఆదేశం

తాను చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు అనుగుణంగా ఒక నెల రోజుల్లోగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని, ఇందుకోసం ఒక ప్రణాళిక సిద్దం చేయాలని జగన్ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాథి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపేయాలన్నసీఎం నిర్దేశించారు. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజి రూపురేఖలు మారాల్సిందేనని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్‌ జరగాలని, స్థానికంగా వారి సేవలను పొందేలా ఒక యాప్‌ను రూపొందించాలని, దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని సీఎం వివరించారు.

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..