బీఎస్ఎఫ్ జవాన్లను వదలని కరోనా.. తాజాగా మరో 69 మందికి పాజిటివ్..

కరోనా మహమ్మారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లను కూడా వదలడం లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట పదుల సంఖ్యలో జవాన్లు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మంగళవారం నాడు.. 69 మంది బీఎస్ఎఫ్..

  • Tv9 Telugu
  • Publish Date - 12:02 am, Wed, 8 July 20
బీఎస్ఎఫ్ జవాన్లను వదలని కరోనా.. తాజాగా మరో 69 మందికి పాజిటివ్..

కరోనా మహమ్మారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లను కూడా వదలడం లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట పదుల సంఖ్యలో జవాన్లు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మంగళవారం నాడు.. 69 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ సోకిన బీఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్య 1,454కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 852 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. ప్రస్తుతం 595 మంది కరోనాతో పోరాడుతూ.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇక మంగళవారం నాడు కరోనా నుంచి కోలుకుని 29 మంది జవాన్లు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఏడు లక్షల మార్క్‌ను దాటేసింది. రోజుకు ఇరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం.. కలకలం రేపుతోంది. ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య కూడా ఇరవై వేలు దాటింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండున్నర
లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.