ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’.. ఎందుకంటే?

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ.. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, […]

ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ'.. ఎందుకంటే?
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 11:43 PM

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ.. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి.

ఇక బతుకమ్మ పండుగలో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు.