కరోనా లాక్ డౌన్.. హోం క్వారంటైన్‌ పాటించకుంటే..

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాడుతున్నాయి.

కరోనా లాక్ డౌన్.. హోం క్వారంటైన్‌ పాటించకుంటే..
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 3:48 PM

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులపాటు బయటకు రాకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే కొందరు ఈ నిబంధనలను బేఖాతరు చేసి స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. వీరిపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల విదేశాల నుంచి నగరానికి వచ్చి హోం క్వారంటైన్‌ నిబంధనలు పాటించని 16 మందిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలను తరలించారు.

కాగా.. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి జోన్‌ నుంచి ఆరుగురు, చార్మినార్‌ జోన్‌ నుంచి ఐదుగురు, శేరిలింగంపల్లి జోన్‌ నుంచి నలుగురు, ఖైరతాబాద్‌ జోన్‌ నుంచి ఒకరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు వైరస్‌ కట్టడికి దేశం మొత్తం లాక్‌డౌన్‌ పాటిస్తోంది. అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.