Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఒకేసారి 6500 ఈ కామర్స్ వెబ్‌సైట్లు హ్యాక్!

ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న 6500 వెబ్‌సైట్లు ఒకే ఒక్క దెబ్బతో హ్యాక్ అయ్యాయి. వాటిలో తమ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు సేవ్ చేసుకున్న అనేక మంది కస్టమర్ల సమాచారం ప్రమాదంలో పడింది. సహజంగా ఒక వెబ్‌సైట్ హ్యాకింగ్ కి గురవటం మనం చూస్తూ ఉంటాం. అయితే వివిధ వెబ్ సైట్లని హోస్టింగ్ చేసే హోస్టింగ్ సర్వర్ హాకింగ్ కు గురయితే దాని ద్వారా నిర్వహించబడుతున్న అన్ని వెబ్ సైట్లు ప్రమాదంలో పడతాయి. తాజాగా ఇలాగే జరిగింది. Volusion అనేది ఇ-కామర్స్ వెబ్‌సైట్లని హోస్ట్ చేసే ఒక పాపులర్ ప్లాట్ ఫారం. అయితే తాజాగా ఇది హ్యాక్ కావటం వలన ప్రపంచవ్యాప్తంగా దాంట్లో తమ సొంత ఆన్లైన్ స్టోర్స్ నిర్వహిస్తున్న అనేకమంది వెబ్‌సైట్లు ప్రమాదంలో పడ్డాయి.

ఆయా వెబ్‌సైట్లలోకి తమ కొనుగోలు పూర్తయిన తర్వాత ఖాతాదారులు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు సమాచారం ఎంటర్ చేసి, బిల్లింగ్ కి పూనుకునే సమయంలో ఆ డేటా మొత్తాన్నీ హ్యాకర్లు తస్కరించడం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో వినియోగదారుల యొక్క సెన్సిటివ్ డేటాని దొంగిలించే విధంగా హ్యాకర్లు ప్రమాదకరమైన కోడ్ వెబ్‌సైట్లలో చొప్పించడం జరిగింది. Magecart Attack అనే పేరుతో పిలువబడే ఈ ప్రమాదకరమైన కోడ్ మనం ఏటీఎం మెషిన్స్ విషయంలో అనేక సందర్భాల్లో చూసిన ఏటీఎం స్కిమ్మర్ల మాదిరిగానే వినియోగదారుల కార్డుల డేటాని సేకరించడం జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6593 ఈ కామర్స్ వెబ్‌సైట్లు ఈ ప్రమాదం బారిన పడ్డాయి. ఒకవేళ వీటిలో మీరు దేంట్లో అయినా కొనుగోలు చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మీ డేటా ప్రమాదంలో పడుతుంది. అధికశాతం వెబ్సైట్లు యూఎస్ లో నివసిస్తున్న వారికి చెందినవి కావడం గమనార్హం. కాబట్టి భారతీయ వినియోగదారులు కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు గానీ, ఒకవేళ అక్కడ నివసిస్తున్న వారు ఎవరైనా ఈ ప్రమాదంలో పడితే మాత్రం కచ్చితంగా మీ కార్డ్ బ్లాక్ చేయించుకోవడం మంచిది.