ఆఖరి సెల్పీ: ఐదుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతు

ఈత సరదా విద్యార్థుల ప్రాణాలను తీస్తుంది. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలో అటు ప్రభుత్వాలు, స్వయం నియంత్రణ పాటించడంలో ఇటు ప్రజలు కూడా విపలమవుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా గార మండటం కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో సరదాగా సముద్ర స్నానం చేసేందుకు బీచ్‌కి వెళ్లిన ఆరుగులు విద్యార్థులు అలల ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరంతా శ్రీకాకుళంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థులుగా గుర్తించారు. […]

ఆఖరి సెల్పీ: ఐదుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతు
Follow us

|

Updated on: Nov 11, 2019 | 5:26 AM

ఈత సరదా విద్యార్థుల ప్రాణాలను తీస్తుంది. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలో అటు ప్రభుత్వాలు, స్వయం నియంత్రణ పాటించడంలో ఇటు ప్రజలు కూడా విపలమవుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా గార మండటం కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో సరదాగా సముద్ర స్నానం చేసేందుకు బీచ్‌కి వెళ్లిన ఆరుగులు విద్యార్థులు అలల ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరంతా శ్రీకాకుళంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థులుగా గుర్తించారు. వారిలో ఒకరిని కోస్ట్‌గార్డ్స్, మెరైన్ సిబ్బంది రక్షించగా..మరొకరి డెడ్‌బాడీ లభ్యమైంది.

ఒకేసారి పెద్ద అల రావడంతోనే విద్యార్థులు గల్లంతైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా మిస్సైనవారి ఆచూకి తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది..తెల్లవారిన తర్వాత సహాయక చర్యలను తిరిగి ప్రారంభించనున్నారు. కాగా దుర్ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు వారు తీసుకున్న సెల్పీ వైరల్‌గా మారింది. విషయం తెలిసిన విద్యార్థుల కుటుంబ సభ్యలు అక్కడికి చేరుకోవడంతో.. బీచ్ పరిసర ప్రాంతాలలో విషాదచాయలు అలముకున్నాయి.

మిస్సైన విద్యార్థులు:

ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి

యజ్ఞమయ పండా

కురుమూరి సందీప్‌

అనపర్తి సుందర్‌

షేక్‌ అబ్దుల్లా

ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థి: రాజసింహ