షాకింగ్.. నగరంలో కరోనా వైరస్ ఉందంటూ.. గాంధీకి ప్రైవేట్ ఆస్పత్రి లేఖ..!

ప్రంపచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో.. ఈ వైరస్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. అలాంటి భయంకరమైన వైరస్.. ఇప్పుడు మన భాగ్యనగరాన్ని కూడా వణికిస్తోంది. ఓ వైపు ఈ వైరస్‌కు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లు ఏర్పాటు చేయగా.. మరోవైపు నగరంలో కరోనా వ్యాధి ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నగరంలో కరోనా భయం లేదని ఆరోగ్యశాఖ మంత్రి […]

షాకింగ్.. నగరంలో కరోనా వైరస్ ఉందంటూ.. గాంధీకి ప్రైవేట్ ఆస్పత్రి లేఖ..!
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 1:31 PM

ప్రంపచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో.. ఈ వైరస్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. అలాంటి భయంకరమైన వైరస్.. ఇప్పుడు మన భాగ్యనగరాన్ని కూడా వణికిస్తోంది. ఓ వైపు ఈ వైరస్‌కు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లు ఏర్పాటు చేయగా.. మరోవైపు నగరంలో కరోనా వ్యాధి ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నగరంలో కరోనా భయం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల స్పష్టం చేశారు కూడా. అయితే గురువారం ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. తమ ఆస్పత్రిలోని ఓ ఆరు నెలల శిశువుకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని.. మీరు కూడా ఓ సారి చెక్ చేయండంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యులు.. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆరు నెలల శిశువుకు కరోనా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై గాంధీ వైద్యులు మండిపడుతున్నారు.

అసలు గాంధీలో వైరాలజీ ల్యాబ్ ఉంటే.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ పరీక్షలు ఎలా చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కాగా.. కరోనాకు సంబంధించి గాంధీలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.