రజినీ ‘రానా’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభిస్తాడా !

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రయాణం ఊహకందకుండా సాగుతోంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనప్పుడు.. వేరే బాధ్యతలు ఏమీ లేనపుడు ఆయన రెండు మూడేళ్లకు ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.

రజినీ ‘రానా’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభిస్తాడా !
Follow us

|

Updated on: Sep 25, 2020 | 3:43 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రయాణం ఊహకందకుండా సాగుతోంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనప్పుడు.. వేరే బాధ్యతలు ఏమీ పెట్టుకోనప్పుడు ఆయన రెండు మూడేళ్లకు ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో సినిమాల విషయంలో ఆయన స్పీడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండేళ్లుగా ఆరు నెలలకు ఒక సినిమా అలరిస్తున్నారు రజినీ. రెండున్నరేళ్ల వ్యవధిలో ఆయన నటించిన కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్(5 సినిమాలు) విడుదల కావడం విశేషం. కరోనా వ్యాప్తి లేకపోతే ఆయన కొత్త సినిమా ‘అన్నాత్తె’ కూడా ఈపాటికే రిలీజై ఉండేది. ఇక రాజకీయ పార్టీ పనుల్లోకి దిగుతోన్న నేపథ్యంలో ఆయన సినిమాల విషమంలో స్పీడు చూపించరని అందరూ భావించారు. కానీ రజినీ ప్రస్తుతం దర్శకులతో కథాచర్చలు జరుపుతున్నారు.

‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ఇంకో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలాగే తనతో చాలా సినిమాలు తీసిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో మళ్లీ జట్టు కట్టేందుకు కూడా రజినీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో  తొమ్మిదేళ్ల కిందట చేయాల్సిన సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుతున్నాయట. 2011లో రవికుమార్ దర్శకత్వంలో రజినీ ‘రానా’ అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునేను ఫైనల్ చేశారు. ఆమె సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొంది. అయితే ఈ సినిమా ప్రారంభించిన రోజే రజనీకాంత్‌ అస్వస్థతకు గురవ్వడంతో షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. 17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడి కథతో ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రచారం జరిగింది.  దీంతో రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో, తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్చడయాన్’ చేశాడు. అయితే  ఆరు నెలల కిందట ‘రానా’ కథ మళ్లీ చెప్పమని రజినీ అడిగినట్లు తాజాగా రవికుమార్ తెలిపారు. తాను కూడా స్టోరీ చెప్పానని..  విన్నాక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా చేయగలమా అని రజినీ అడిగారని రవికుమార్ వివరించారు. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే  ఏడాది ఎన్నికలు అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కినా ఆశ్యర్యం ఉండదు.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

తాలుకు కూడా అదిరే రేటు !

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు