అమ్మవారి గుడికి అర లక్ష ట్యాక్స్‌

Six lakhs tax tothe Temple in warngal district, అమ్మవారి గుడికి అర లక్ష ట్యాక్స్‌

ఆలయాలకు ట్యాక్స్‌ వేయటం మీరేక్కడైనా చూశారా..అది కూడా అర లక్ష..ఇక ఆ గుడి విషయానికి వస్తే..గ్రామం మధ్యలోనే వెలసిన… గ్రామదేవత అయిన పోచమ్మ వారి మందిరం. ఒకే గదితో ముందు రేకుల షేడుతో ఉన్న ఆ గుడికి దాదాపు 50 వేల దాకా ప్రాపర్టీ ట్యాక్స్‌ పంపారు అధికారులు. ఇంతకీ ఆ గుడి ఎక్కడో తెలుసా..? వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల ఎన్టీఆర్‌ నగర్‌లో ఉంది. పోచమ్మ గుడికి గత కొంతకాలంగా ట్యాక్స్‌ బకాయి ఉందంటూ…మొత్తం రూ.43 వేల అమౌంట్ త్వరలోనే కట్టాలని వరంగల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు పంపారు. అది చూసి, గ్రామస్తులు ఖంగుతిన్నారు. అమ్మవారి ఆలయానికి ట్యాక్స్‌ వేయటం ఎంటని అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ పోచమ్మ అమ్మవారి ఆలయం ఉన్న సంగతి గూగుల్‌ మ్యాప్‌లో కూడా చూపిస్తుందని.., అటువంటిది అధికారులు ఎలా గుర్తించలేకపోయారని మండిపడుతున్నారు. జరిగిన ఘటన కార్పొరేషన్‌ పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *