సీఏఏపై యూరప్ లోనూ నిరసనలు.. ఆరు తీర్మానాలను ప్రతిపాదించిన ఎంపీలు

వివాదాస్పద సీఏఏపై ఇండియా….  యూరపియన్ పార్లమెంటు నుంచి కూడా తీవ్ర నిరసనను ఎదుర్కొంది. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షలను కూడా యూరపియన్ ఎంపీలు ఖండించారు. మార్చి నెలలో బ్రసెల్స్ లో జరగనున్న ఇండియా-ఈయూ సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఈ నూతన పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఈయూ పార్లమెంటులోని 751 మంది ఎంపీల్లో 600 మందికి పైగా సభ్యులు ఈ రెండు అంశాలపైనా 6 తీర్మానాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా సవరించిన […]

సీఏఏపై యూరప్ లోనూ  నిరసనలు.. ఆరు తీర్మానాలను ప్రతిపాదించిన ఎంపీలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 27, 2020 | 11:47 AM

వివాదాస్పద సీఏఏపై ఇండియా….  యూరపియన్ పార్లమెంటు నుంచి కూడా తీవ్ర నిరసనను ఎదుర్కొంది. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షలను కూడా యూరపియన్ ఎంపీలు ఖండించారు. మార్చి నెలలో బ్రసెల్స్ లో జరగనున్న ఇండియా-ఈయూ సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఈ నూతన పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఈయూ పార్లమెంటులోని 751 మంది ఎంపీల్లో 600 మందికి పైగా సభ్యులు ఈ రెండు అంశాలపైనా 6 తీర్మానాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా సవరించిన పౌరసత్వ చట్టం వల్ల ప్రపంచంలో అతి పెద్ద సంక్షోభం తలెత్తవచ్ఛునన్న అనుమానాలను వీరు వ్యక్తం చేశారు.

ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఆఫ్ సోషలిస్ట్స్ అండ్ డెమోక్రట్స్ పార్టీకి చెందిన 154 మంది సభ్యులు, యూరపియన్ పీపుల్స్ పార్టీకి చెందిన 182 మంది, యూరపియన్ యునైటెడ్ లెఫ్ట్ అండ్ నోర్డిక్ గ్రీన్ లెఫ్ట్ కు చెందిన 41 మంది, యూరపియన్ ఫ్రీ అలయెన్స్ సభ్యులు 75 మంది, అలాగే 66 మంది కన్సర్వేటివ్ రిఫార్మిస్టులు వీటిని ప్రవేశపెట్టారు. రెన్యూ గ్రూపు ఎంపీలు 108 మంది కూడా వీరితో గళం కలిపారు.

శరణార్థులకు సంబంధించి భారత్ తన విధానాల్లో మత ప్రాతిపదికను జొప్పించిందని ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఆఫ్ సోషలిస్ట్స్, డెమొక్రాట్స్ విమర్శించారు. ఆ దేశ అంతర్జాతీయ ప్రతిష్టకు, అంతర్గత సుస్థిరతకు ఈ చర్య ప్రతికూల పరిణామాలను సృష్టిస్తుందని యూరపియన్ పీపుల్స్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సీఏఏ అన్నది పూర్తిగా మా అంతర్గత వ్యవహారమని కేంద్రం స్పష్టం చేసింది. ఇది మతానికి సంబంధించిన అంశం కాదు.. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టిన ఎంపీలు మొదట దీనికి సంబంధించిన వాస్తవాలను పరిశీలించాలి అని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగిన అనంతరమే ప్రజాస్వామ్యయుతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.