‘పులి’జూదంలో శివసేనది స్యూసైడేనా ?

శివసేన స్యూసైడ్ చేసుకుందా ? పరిస్థితి చూస్తుంటే.. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న సమీకరణలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై మక్కువతో 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీతో వున్న అనుబంధాన్ని తెంచుకున్న శివసేనకు చివరికి ముఖ్యమంత్రి పీఠం దూరమవడంతోపాటు.. అసలు భవిష్యత్తే లేని దుస్థితి దక్కే పరిస్థితి కనిపిస్తోంది. నెంబర్ గేమ్‌లో బ్లాక్ మెయిల్‌తో నెగ్గుకొద్దామనుకున్న శివసేన.. చివరికి బిజెపి పన్నిన వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడే పరిస్థితి కనిపిస్తోంది. 21 అక్టోబర్‌న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ […]

‘పులి’జూదంలో శివసేనది స్యూసైడేనా ?
Follow us

|

Updated on: Nov 12, 2019 | 1:06 PM

శివసేన స్యూసైడ్ చేసుకుందా ? పరిస్థితి చూస్తుంటే.. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న సమీకరణలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై మక్కువతో 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీతో వున్న అనుబంధాన్ని తెంచుకున్న శివసేనకు చివరికి ముఖ్యమంత్రి పీఠం దూరమవడంతోపాటు.. అసలు భవిష్యత్తే లేని దుస్థితి దక్కే పరిస్థితి కనిపిస్తోంది. నెంబర్ గేమ్‌లో బ్లాక్ మెయిల్‌తో నెగ్గుకొద్దామనుకున్న శివసేన.. చివరికి బిజెపి పన్నిన వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడే పరిస్థితి కనిపిస్తోంది.

21 అక్టోబర్‌న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే నెల 24న వెలువడిన సంగతి తెలిసిందే. అయిదేళ్ళ పాటు అత్యంత వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చి.. చివరికి బిజెపిని తమపై ఆధారపడి పరిస్థితికి పరిమితం చేసిన శివసేన.. తమ డిమాండ్లకు బిజెపి తలొగ్గుతుందనే భావించింది. ఉద్ధవ్ థాక్రే కంటే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ రెచ్చిపోయి చేసిన ప్రకటనలు బిజెపి అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయనడంలో అతిశయోక్తి లేదు.

ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే ప్రసక్తే లేదని పలు సందర్భాలలో తేల్చి చెప్పిన బిజెపి నేతలు.. శివసేన ఏం చేస్తుందో చూడాలని వేచి చూశారు. అనుకున్నట్లుగానే శివసేన.. కాంగ్రెస్ మద్దతు కోసం అర్రులు చాచింది. బిజెపికి వ్యతిరేకంగా మారితే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని కలలు కన్నది. కానీ సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ భేటీలో కాస్త లోతుగానే చర్చించారు. ఇంతకాలం సెక్యూలర్ పార్టీగా వున్న పేరును శివసేనతో కల్వడం ద్వారా ఒక్కసారిగా పొగొట్టుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదన్న వాస్తవం కనిపించగానే కాంగ్రెస్ నేతలు.. శివసేనకు మద్దతిచ్చే విషయంలో పి.వి.నరసింహారావు వ్యూహాన్ని అమలు చేశారు. కీలక సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకోకపోవడమే పి.వి. ఫార్ములా అన్నది అందరికి తెలిసిందే.

ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏడున్నర కల్లా గవర్నర్ ముందుకు మద్దతు లేఖలను సమర్పించాల్సిన గడువు దాటేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటించింది. ఫలితంగా గవర్నర్ శివసేన గడువు పొడిగింపు విఙ్ఞప్తిని తోసి పుచ్చడం.. మూడో పెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇప్పుడు బంతి ఎన్సీపీ కోర్టుకు చేరిన దరిమిలా.. శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ప్రస్తుతానికి చేజారినట్లుగానే భావించాలి. అయితే.. ఎన్సీపికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియే అయినా.. అప్పుడు ఆ కూటమికి శివసేన మద్దతు అనివార్యమవుతుంది. అప్పుడు కూడా ప్రభుత్వంలో చేరిన మంత్రి పదవులు దక్కొచ్చు గాక ముఖ్యమంత్రి పీఠం మాత్రం శివసేనకు దక్కే ఛాన్స్ లేదు.

ఇటు చిరకాల మిత్రపక్షం బిజెపిని కోల్పోయి.. అటు చిరకాల ప్రత్యర్థులు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరైనా.. వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లు.. ఏ మంత్రి పదవులతోనో సరిపెట్టుకోవాల్సిందే తప్ప కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం మాత్రం దక్కే చాన్స్ లేదు. అటు కేంద్రంలో వున్న మంత్రి పదవులు కోల్పోయి.. ఇటు రాష్ట్రంలో అనుకున్న ముఖ్యమంత్రి పీఠం రాక శివసేన ఒక రకంగా లేని బలాన్ని ఊహించుకుని బొక్కబోర్లా పడినట్లుగానే భావించాలి.

ఇంత జరిగాక.. రేపు మధ్యంతరం వచ్చినా జనం ముందుకు ఏం చెప్పుకుని వెళతారనేది ప్రశ్నార్థకమే. అదే సమయంలో బిజెపికి శివసేన చేసిన మిత్ర ద్రోహం గురించి బాగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని శివసేన కల్పించింది. ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన చౌకబారుగా వ్యవహరించిందన్న ప్రచారాన్ని బిజెపి ఆల్‌రెడీ జోరుగా చేస్తూనే వుంది. ఎన్నికల దాకా కాంగ్రెస్, ఎన్సీపీలను తెగ విమర్శించి, ఫలితాలు రాగానే ముఖ్యమంత్రి పీఠం కోసం ఆ పార్టీలతో కల్వాలన్న వెంపర్లాట శివసేనకు క్రెడిబిలిటీని కోల్పోయేలా చేసిందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే శివసేన విధానాలిపుడు స్యూసైడల్ పాలిటిక్స్‌ని తలపిస్తున్నాయనే చెప్పాలి.

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా