అయిదేళ్ళ పగతో రగులుతున్న శివసేన..బిజెపికి భంగపాటేనా ?

అయిదేళ్ళపాటు అవమానాలను దిగమింగిన శివసేన.. బిజెపి మీద పగ తీర్చుకునేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం పంచుకుంటే ఓకే లేకపోతే మా మార్గాలు మాకున్నాయంటూ.. సరికొత్త పొత్తులకు ఎత్తులు వేస్తోంది. అందుకు చిరకాల శతృవులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జత కట్టేందుకు కూడా సిద్దమవుతోంది. మహారాష్ట్రీయులలో శివసేనకున్న క్రెడిబిలిటీని కూడా ఫణంగా పెట్టేందుకు సాహసిస్తోంది. శివసేన అంటే హార్డ్ కోర్ హిందుత్వమనే భావన నుంచి కేవలం అధికారమే పరమావధి.. పగతీర్చుకోవడమే లక్ష్యమన్న ధోరణితో ముందుకెళుతోంది శివసేన. 2014 […]

అయిదేళ్ళ పగతో రగులుతున్న శివసేన..బిజెపికి భంగపాటేనా ?
Follow us

|

Updated on: Nov 01, 2019 | 7:18 PM

అయిదేళ్ళపాటు అవమానాలను దిగమింగిన శివసేన.. బిజెపి మీద పగ తీర్చుకునేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం పంచుకుంటే ఓకే లేకపోతే మా మార్గాలు మాకున్నాయంటూ.. సరికొత్త పొత్తులకు ఎత్తులు వేస్తోంది. అందుకు చిరకాల శతృవులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జత కట్టేందుకు కూడా సిద్దమవుతోంది.
మహారాష్ట్రీయులలో శివసేనకున్న క్రెడిబిలిటీని కూడా ఫణంగా పెట్టేందుకు సాహసిస్తోంది. శివసేన అంటే హార్డ్ కోర్ హిందుత్వమనే భావన నుంచి కేవలం అధికారమే పరమావధి.. పగతీర్చుకోవడమే లక్ష్యమన్న ధోరణితో ముందుకెళుతోంది శివసేన. 2014 పార్లమెంటు ఎన్నికలు కాగానే తమ పార్టీకి చెందిన సురేశ్ ప్రభును బిజెపిలో చేర్చుకోవడమే కమలంపార్టీ చేసిన అతి పెద్ద తప్పు. ఆ తర్వాత అరు నెలల కాలంలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బిజెపి పొత్తు లేకుండానే పోటీకి దిగాయి. అది కాస్తా బిజెపికి లాభించింది. అదే పరిస్థితి పునరావృతమైతే తాజా అసెంబ్లీ ఎన్నికల్లోను శివసేనకు పరాభవమే మిగులుతుందని శివసేన అధినాయకత్వం భావించింది.
అందుకే బిజెపిని నెంబర్ గేమ్‌లో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా వుంచాలని భావించి పొత్తుకు సిద్దపడింది. బిజెపిని 150 సీట్లకు పోటీ చేసేలా చేసి.. తమ వర్గాలను బిజెపికి పెద్దగా సహకరించకుండా రహస్య ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా బిజెపి 105 సీట్లకే పరమితమై శివసేన లేనిదే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి కల్పించింది.
ఫలితాలు తాము అనుకున్నట్లు వెలువడుతుండగానే.. శివసేన ఎంపీ సంజయ్  రౌత్‌తో మాట్లాడించడం మొదలుపెట్టారు ఉద్ధవ్ థాక్రే. పదవుల్లో చెరి సగం తీసుకోవడంతోపాటు.. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి రెండున్నరేళ్ళు పంచుకోవడం శివసేన ప్రధాన డిమాండ్. దానికి బిజెపి ససేమిరా అనడంతో.. గత పది రోజులుగా మహా సంక్షోభం కొనసాగుతోంది.
శివసేన తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదన్న సంకేతాలిస్తున్న సిట్టింగ్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. అయిదేళ్ళు సీఎం పదవిలో తానే కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. దాంతో ఇక బిజెపి దిగి వచ్చే పరిస్థితి లేదని గుర్తించిన శివసేన నాయకత్వం.. చిరకాల ప్రత్యర్థులైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అయితే.. వీరిద్దరి మధ్య భేటీలో ఓ కీలకాంశం దగ్గర బ్రేక్ పడినట్లు విశ్వసనీయ సమాచారం. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. ఇవన్నీ కలిపితే.. 154 సీట్లు. వీరి కూటమికి వుంటాయి.
అయితే.. ఇప్పటికే 17 మంది ఇండిపెండెంట్లు.. బిజెపి వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో కావాల్సిన మేజిక్ ఫిగర్ బిజెపి ఒంటరిగా చేరువవుతుందా లేక కొత్తగా కూర్పు కానున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది తేలాల్సి వుంది. ఈ అంశమే శరద్-సంజయ్ భేటీలో కీలకాంశం అయ్యిందని సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా లేదని విశ్లేషకులు అంటున్నారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!