Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

హోరాహోరీగా మా ఎన్నికలు.. నరేశ్‌పై శివాజీ రాజా ఫైర్

, హోరాహోరీగా మా ఎన్నికలు.. నరేశ్‌పై శివాజీ రాజా ఫైర్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గత కొంత కాలంగా హాట్‌గా జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఆ పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నటుడు నరేశ్, ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇరు వర్గాలు గెలుపు కోసం ప్రచారం స్పీడు పెంచారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే శివాజీ రాజా గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేశ్ వర్గం చేసే వ్యాఖ్యలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉండటం వల్లే మీడియా సమావేశం ఉందని చెప్పారు. నరేశ్ ప్యానల్ మీడియా ముందుకెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని శివాజీ అన్నారు.

ఇష్టంలేకుండానే ఈసారి పోటీ చేస్తున్నానని శివాజీ అన్నారు. నరేష్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎప్పుడూ సహకరించలేదు. గతంలో నిధులు కావాల్సినప్పుడు చిరంజీవి గారితో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే రిహార్సల్స్ కు రాలేదు. నా పుట్టినరోజు నాడు నన్ను చాలా ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించాడు. జీవిత లాంటి వాళ్లు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివాజీరాజా.