Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

ఐటీ గ్రిడ్‌ కేసు… కేసీఆర్ పొలిటికల్ స్టంట్- శివాజీ

, ఐటీ గ్రిడ్‌ కేసు… కేసీఆర్ పొలిటికల్ స్టంట్- శివాజీ

విజయవాడ: తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

‘‘డేటా దొంగతనం అంతర్జాతీయ సమస్యలా భారతదేశంలో మొదటిసారి జరుగుతున్నట్లు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. తెలంగాణ ఓట్ల గల్లంతు అనేది వారికి కుంభకోణం కాకపోవచ్చు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకోవాలి. ఎన్నికల అధికారికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అడగాల్సిన పని ఏంటి? ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. గ్రేటర్‌ హైదరాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సెటిలర్స్‌ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లు తొలగించే ముందు సమగ్ర సర్వే పూర్తి చేశారు. ఐటీశాఖ, ఈసీ కలిసి హైదరాబాద్‌లో ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశాయి. అందుకు ఎస్‌ఆర్‌డీహెచ్‌ యాప్‌ను తయారు చేశారు. ఓట్లు తొలగించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను వాడుకున్నరనేది నిజమా? కాదా?’’ అని ప్రశ్నించారు.

‘‘డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమే. కేసీఆర్‌ను చూస్తే ఎందుకు భయపడాలి. హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూను చంపేశారు. ఏపీ సర్కారు తప్పు చేస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి. ఓట్ల తొలగింపుపై అప్పట్లోనే మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలి.’’ అని అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ప్రజల తరపున అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నట్లు శివాజీ తెలిపారు.