‘ నివురు గప్పిన నిప్పు ‘ లా నియంత్రణ రేఖ… మేం రెడీ !

పాకిస్థాన్ పొడవునా గల నియంత్రణ రేఖ (ఎల్ఓసి) నివురు గప్పిన నిప్పులా ఉందని, అక్కడ ఏక్షణమైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తవచ్చునని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. పాక్ ఆర్మీ తమ బోర్డర్ యాక్షన్ టీమ్ ని అక్కడ ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. హైలెవెల్ ఆపరేషన్, రెడీనెస్ అన్నదే మా లక్ష్యం.. వివిధ కంటింజెన్సీలకు సంబంధించి వివరణాత్మక ప్లాన్ లతో […]

' నివురు గప్పిన నిప్పు ' లా నియంత్రణ రేఖ...  మేం  రెడీ !
Follow us

|

Updated on: Dec 19, 2019 | 2:06 PM

పాకిస్థాన్ పొడవునా గల నియంత్రణ రేఖ (ఎల్ఓసి) నివురు గప్పిన నిప్పులా ఉందని, అక్కడ ఏక్షణమైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తవచ్చునని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. పాక్ ఆర్మీ తమ బోర్డర్ యాక్షన్ టీమ్ ని అక్కడ ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. హైలెవెల్ ఆపరేషన్, రెడీనెస్ అన్నదే మా లక్ష్యం.. వివిధ కంటింజెన్సీలకు సంబంధించి వివరణాత్మక ప్లాన్ లతో మేం ఎప్పటికప్పుడు సన్నద్దులయ్యే ఉన్నాం ‘ అని రావత్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఎల్ఓసి వద్ద సుందర్ బని సెక్టార్లో పాక్ ఆర్మీ.. బోర్డర్ యాక్షన్ టీమ్ ఆపరేషన్ కు ప్రయత్నించగా.. దాన్ని భారత జవానులు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత జవాను ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. అయితే ఆ కాల్పుల్లో ఎంతమంది పాక్ సైనికులు మరణించిందీ తెలియలేదు.

వారంలో ప్రతి మూడో రోజూ పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని, అయితే ప్రతీకార దాడులకు దిగుతున్నామని రావత్ వెల్లడించారు. ఇప్పటికే పాక్ 2,900 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి ఉద్దేశించిన 360 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసినప్పటినుంచి ఏదో ఒక సందర్భంలో పాకిస్థాన్ దళాలు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదులు దొంగచాటుగా ఈ రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఎన్నో సార్లు యత్నించారు. అయితే భారత సైన్యం అప్రమత్తతతో వారి ఆగడాలు సాగడంలేదు. .

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..