డాలర్స్‌ కట్టలతో కుర్చీ..చూసి మురిసిపోవలసిందే..

కుర్చీ అంటే మనం ఏ వుడ్‌తోనో, ప్లాస్టిక్‌తోనో చేయించుకుంటాం. సంపన్నులైతే ఎర్రచందనంతో స్పెషల్‌గా తయారుచేయించుకుంటారు. ఇంకా కుబేరులైతే ఫారెన్‌ కంట్రీస్‌ నుంచి కాస్ట్లీ చైర్స్‌ను ఇంపోర్ట్‌ చేసుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కరెన్సీ కట్టలు కుక్కిన కుర్చీని ఎప్పుడైనా చూశారా. లేదు కదా. డాలర్స్‌ నింపిన ఖరీదైన కుర్చీ చూడాలంటే మాత్రం మీరు రష్యా వెళ్లాల్సిందే. ఈ సింహాసనాన్ని బిలియనీర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇగోర్‌ రైబాకోవ్‌ సహకారంతో రష్యన్‌ కళాకారుడు అలెక్సీ సెర్గింకో రూపొందించారు. ఇటీవలే రష్యా […]

డాలర్స్‌ కట్టలతో కుర్చీ..చూసి మురిసిపోవలసిందే..
Follow us

|

Updated on: Dec 02, 2019 | 5:11 PM

కుర్చీ అంటే మనం ఏ వుడ్‌తోనో, ప్లాస్టిక్‌తోనో చేయించుకుంటాం. సంపన్నులైతే ఎర్రచందనంతో స్పెషల్‌గా తయారుచేయించుకుంటారు. ఇంకా కుబేరులైతే ఫారెన్‌ కంట్రీస్‌ నుంచి కాస్ట్లీ చైర్స్‌ను ఇంపోర్ట్‌ చేసుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కరెన్సీ కట్టలు కుక్కిన కుర్చీని ఎప్పుడైనా చూశారా. లేదు కదా. డాలర్స్‌ నింపిన ఖరీదైన కుర్చీ చూడాలంటే మాత్రం మీరు రష్యా వెళ్లాల్సిందే.

ఈ సింహాసనాన్ని బిలియనీర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇగోర్‌ రైబాకోవ్‌ సహకారంతో రష్యన్‌ కళాకారుడు అలెక్సీ సెర్గింకో రూపొందించారు. ఇటీవలే రష్యా రాజధాని మాస్కో ఆర్ట్‌ రెసిడెన్సీలో ప్రదర్శనకు పెట్టారు. గాజు పలకలతో తయారుచేసిన ఈ కుర్చీ మధ్యలో డాలర్లతో నింపారట. ఇంత ఖరీదైన కుర్చీని చూసేందుకు అక్కడి జనం క్యూ కడుతున్నారు. కానీ దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం పది లక్షల డాలర్లు ఉండాల్సిందే. అంటే మన కరెన్సీలో అక్షరాలా 7 కోట్ల 17లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మరి ఇదేమైనా ఆషామాషీ కుర్చీనా. కాదు కదా. డాలర్స్‌ నింపిన కుర్చీ. దీంతో చూడటానికే పరిమితమవుతున్నారు స్థానికులు. ఐతే జిహ్వకో బుద్ధి పుర్రెకో బుద్ధి అంటారు కదా. అలాగే తమ స్టేటస్‌ను చూపించుకోవాలనుకునేవారెవరైనా ఈ చైర్‌ను కొనుగోలు చేస్తారేమో చూడాలి మరి.