సుప్రీం కోర్టు ఆదేశాలతో… కశ్మీర్‌కు సీతారాం ఏచూరి!

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం సీతారాం ఏచూరి ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తారిగామి నివాసానికి వెళ్లిపోయారు. తారిగామి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత. ఏచూరికి మంచి స్నేహితుడు కూడా .. అయితే ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అతనిని చూసి ఆరోగ్య పరిస్థితి కనుక్కొనేందుకు సీతారం ఏచూరి కశ్మీర్ వెళ్లారు. రెండుసార్లు వెళ్లిన పోలీసులు వెళ్లనీయక అడ్డుకొన్నారు. దీంతో నిన్న ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ […]

సుప్రీం కోర్టు ఆదేశాలతో... కశ్మీర్‌కు సీతారాం ఏచూరి!
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 12:23 AM

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం సీతారాం ఏచూరి ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తారిగామి నివాసానికి వెళ్లిపోయారు. తారిగామి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత. ఏచూరికి మంచి స్నేహితుడు కూడా .. అయితే ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అతనిని చూసి ఆరోగ్య పరిస్థితి కనుక్కొనేందుకు సీతారం ఏచూరి కశ్మీర్ వెళ్లారు. రెండుసార్లు వెళ్లిన పోలీసులు వెళ్లనీయక అడ్డుకొన్నారు. దీంతో నిన్న ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఓ దేశంలో పౌరుడు ఎక్కడికి వెళ్లాలంటే నిరంభ్యంతరంగా వెళ్లొచ్చని .. ఏచూరిని ఆపడం సరికాదని స్పష్టంచేశారు. గురువారం శ్రీనగర్ వెళ్లేందుకు సీతారాం ఏచూరికి అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌తో ఏచూరి శ్రీనగర్ వెళ్లారు.

అయితే ఏచూరి తన స్నేహితుడిని కలిసి వెళ్లిపోవాలని సూచించింది. పర్యటన సందర్భంగా ఎలాంటి రాజకీయాలు చేయొద్దని తేల్చిచెప్పింది. ఒకవేళ ఏచూరి రాజకీయ వ్యాఖ్యలు, పొలిటికల్ లీడర్లతో సమావేశమైతే .. దానికి సంబంధించి ఆధారాలను తమకు సమర్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 5 జమ్ము కశ్మీర్ విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించి .. పరిస్థితిని పర్యవేక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కశ్మీర్‌లో ఉండి పరిస్థితులను పరిశీలించిన సంగతి తెలిసిందే.