సిట్ ఏర్పాటు… కేరళ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి… విచారణ చేపట్టిన పోలీసులు అధికారులు…

ఎస్వీ ప్రదీప్ అనే కేరళకు చెందిన జర్నలిస్ట్ ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే అతని మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరపాలని జర్నలిస్ట్ యూనియన్లు డీజీపీని కోరారు.

సిట్ ఏర్పాటు... కేరళ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి... విచారణ చేపట్టిన పోలీసులు అధికారులు...
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2020 | 7:42 AM

ఎస్వీ ప్రదీప్ అనే కేరళకు చెందిన జర్నలిస్ట్ ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే అతని మరణంపై జర్నలిస్టు సంఘాలు, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో జర్నలిస్ట్ మ‌ృతిపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరపాలని కోరారు.

స్పందించిన కేరళ డీజీపీ ప్రదీప్ మృతిపై సమగ్ర విచారణకు పోలీసు అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేశారు. కాగా ప్రదీప్ ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ ఘటనలో ప్రదీప్ చనిపోయారు.

అయితే ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు. ప్రదీప్ వాహనాన్ని ఢీకొట్టిన వాహనం కోసం వెతుకుతున్నామని, అందుకోసం అవసరమైన అన్ని మార్గాల్లో ఆధారాల సేకరణ కోసం కృషి చేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. కాగా, ప్రదీప్ మృతిపై అనుమానాలున్నాయని, నిందితులు ఎవరైనా వొదలలొద్దని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.