‘సర్.. బెన్‌స్టోక్స్’?

ఐసీసీ వరల్డ్ కప్ 2019 లో భాగంగా లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాఛ్ లో స్టోక్స్ వీరోచితంగా పోరాడాడు. మందకొడి పిచ్‌పై వికెట్లు పడుతున్నా, ఒత్తిడి చిత్తు చేస్తున్నా 98 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ టై చేశాడు. ఆ తర్వాత టై అయిన సూపర్‌ ఓవర్‌లోనూ 8 పరుగులు సాధించి ఇంగ్లండ్ విజయానికి మూలకారణమయ్యాడు. స్టోక్స్‌ ప్రదర్శనకు ముగ్ధులైన బ్రిటన్‌ జాతీయ నేతలు బోరిస్‌ జాన్సన్‌, జెరెమీ హంట్‌ అతడికి అత్యున్నత పురస్కారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. థెరెసా మే నిష్క్రమణతో వీరిద్దరూ బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందున్నారు.

‘నేను డ్యూక్‌డోమ్స్‌ ఇస్తాను. ఏదైనా సరే అత్యున్నతమైందే ఇస్తాను. గార్టర్‌ కింగ్‌ ఆఫ్ ఆర్మ్స్‌ అయినా సరే’ అని జాన్సన్‌ అన్నారు. ది సన్‌, టాక్‌ రేడియో ఏర్పాటు చేసిన నాయకత్వ చర్చలో అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌ ‘అవును, కాదు’ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘స్టోక్స్‌ నైట్‌హుడ్‌కు అర్హుడేనా’ అన్న ప్రశ్నకు జాన్సన్‌ ‘కచ్చితంగా, నా జవాబు అవును’ అని చెప్పారు. ఇదే ప్రశ్నకు హంట్‌ ‘ఆఫ్‌కోర్స్‌’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 11 మంది క్రికెటర్లకు నైట్‌హుడ్‌ ఇచ్చారు. చివరి సారి ఇంగ్లాండ్‌ మాజీ టెస్టు సారథి అలిస్టర్‌ కుక్‌కు దీనిని ప్రధానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *