ముక్కు దిబ్బడ తో సమస్యా? ఇలా చేసి చూడండి

Sinus Pain And Pressure: 6 Home Remedies For Instant Relief, ముక్కు దిబ్బడ తో సమస్యా?  ఇలా చేసి చూడండి

అసలే వర్షాకాలం.. బయటికి వెళ్లినా వెళ్లకపోయినా ఇట్టే జలుబు చేయడం సహజం. జలుబు చేసినప్పుడు వేధించే సమస్య ముక్కు దిబ్బడ కట్టి ,శ్వాస తీసుకోడానికి చాల కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ముక్కునుంచి విపరీతంగా నీరు కారడం కూడా మరో సమస్య. ముక్కులో ఉండే సైనస్ నరాలు వాచిపోయి ఈ సమస్య ఏర్పడుతుంది. మరి ఇటువంటి సమస్యను సులువైన చిట్కాలతో ఎదుర్కొని చక్కగా శ్వాస తీసుకోవచ్చు.
సైనస్ నొప్పి ఎందుకు వస్తుంది

ఇబ్బందిపెట్టే సైనస్ నొప్పి

శ్వాస తీసుకోడానికి ప్రధాన అంగం ముక్కు.వర్షాకాలం, చలికాలాల్లో జలుబుకు కారణమయ్యే వైరస్‌ ఇది వాచిపోతుంది. ముక్కులో ఉండే సైనస్ వద్ధ అతి సున్నితమైన పలుచని త్వచాలు ఉబ్బిపోతాయి. ఈ విధంగా ఉబ్బడంతో మనకు ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. ఇక అప్పటినుంచి ముక్కును బలంగా చీదుతూ ఉంటారు. దీంతో మరింత వాచిపోతాయి. పైగా నీరు కూడా కారుతూ ఉండటం వల్ల అక్కడ ఇరిటేషన్ కలుగుతుంది. ఎలర్జీ వంటిది సోకుతుంది. దీని ప్రభావంతో ముక్కు సైనస్ సమస్య మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

సైనస్ నొప్పికి ఇలా చేస్తే సరి

ముక్కు వద్ద ఉండే సైనస్ కండరాలు వాచి ఇబ్బంది పెడుతున్నా లేక ముక్కునుంచి నీరు కారుతూ ఉంటే కనీసం రెండు మూడు గంటలకు ఒకసారి దాన్ని శుభ్రం చేయాలి. ముక్కు తడారి పోకుండా ఉండేందుకు గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డిహైడ్రేషన్ రాకుండా కూడ ఉంటుంది.
సైనస్ ఇబ్బంది పెడుతుంటే నాసిల్ స్ప్రే వాడితే ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఆవిరి పట్టినా మంచి ప్రయోజనం ఉంటుంది. ముందు చెప్పుకున్నట్టుగా నీళ్లు తాగాలి. వీటన్నిటితో పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పినవి పాటించడం ద్వారా సైనస్ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *