ఎల్వీ తర్వాత సింఘాల్.. కాకరేపుతున్న జగన్ నిర్ణయాలు

ఏపీ సీఎస్ పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఉద్వాసన పలికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి బదిలీ వేటుకు తెగిపడేది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ అని అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంతో కాలం వేచి చూసి, చివరికి కేంద్రంలోని పవర్ సెంటర్ లాబీయింగ్‌తో టిటిడి ఈవో వచ్చిన సింఘాల్‌ను బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని సీఎం జగన్ దాదాపు […]

ఎల్వీ తర్వాత సింఘాల్.. కాకరేపుతున్న జగన్ నిర్ణయాలు
Follow us

|

Updated on: Nov 05, 2019 | 4:48 PM

ఏపీ సీఎస్ పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఉద్వాసన పలికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి బదిలీ వేటుకు తెగిపడేది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ అని అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంతో కాలం వేచి చూసి, చివరికి కేంద్రంలోని పవర్ సెంటర్ లాబీయింగ్‌తో టిటిడి ఈవో వచ్చిన సింఘాల్‌ను బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని సీఎం జగన్ దాదాపు తీసేసుకున్నారని తెలుస్తోంది. సింఘాల్ బదిలీ ఉత్తర్వులు ఏ క్షణమైనా రావచ్చని మంగళవారం సీఎంవో వర్గాలు సూత్రప్రాయంగా వెల్లడించాయి.
నిజానికి టిటిడి ఈవో ఒక నార్త్ ఇండియన్ ఐఏఎస్ అధికారిని నియమించడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. కొంత మంది తిరుపతి వర్గాలైతే సింఘాల్ నియామకానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు కూడా. అయితే.. అప్పట్లో కేంద్రంలోని పవర్ సెంటర్ లాబీయింగ్ గట్టిగా వుండడం, వారికి అండగా ఓ వ్యాపార దిగ్గజం వుండడం వల్ల చంద్రబాబు సింఘాల్ నియామకంపై వెనక్కి తగ్గలేదు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. సింఘాల్‌ను తప్పించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. సింఘాల్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సింఘాల్ స్థానంలో ఈవోగా సీనియర్ ఐఎఎస్ అధికారి జె.ఎస్.వీ.ప్రసాద్‌ను టిటిడి ఈవోగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానంలో సతీష్ చంద్ర అనే మరో అధికారిని నియమించినట్లుగా తెలుస్తోంది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..