న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్

Singer Sunitha, న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్

న్యూజెర్సీలో సౌత్ ఏషియన్ సమ్మర్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ గాయని సునీత టీమ్ అద్భుతమైన ఫెర్‌పార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక్కడున్న తెలుగు ఎన్నారైలకు సంగీతామృతాన్ని పంచుతూ ఆమె గానం చేసిన గీతాలు అక్కడి వారిని ఓలలాడించింది. సింగర్ సునీతతో పాటు , అనురుద్, శ్రుతి కూడా తమ పాటలతో మైమరపించారు.

ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు యాంకర్ అనసూయ. ప్రేక్షకుల్ని ఆమె తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ సునీతకు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ స్పెషల్ హానర్ లభించినట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..తనకు ఈవిధమైన గౌరవం లభించడం ఎంతో అనందంగా ఉందని, ఈ గౌవరం తనలో మరింత బాధ్యతను పెంచిదన్నారు సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *