రాక్‌స్టార్ తమ్ముడి మరో అవతారం

తన అద్భుత సంగీతంతో టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్‌ డైరక్టర్‌గా కొనసాగుతున్న రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మంచి గాయకుడన్న విషయం తెలిసిందే. బయటి మ్యూజిక్ డైరక్టర్స్‌తో పనిచేయనప్పటికీ.. తన అన్న సంగీత దర్శకత్వంలో పలు హిట్ చిత్రాలకు పాటలు పాడి, అవార్డులు సొంతం చేసుకున్నాడు సాగర్. అలాగే బుల్లితెర వ్యాఖ్యతగా, ఒకట్రెండు పాటలకు లిరిక్ రైటర్‌గా కూడా పనిచేశాడు. ఇదిలా ఉంటే తన అన్నలాగే మల్టీ టాలెంటెడ్ అనిపించుకోవాలనుకుంటున్న ఈ సింగర్.. ఇప్పుడు మరో […]

రాక్‌స్టార్ తమ్ముడి మరో అవతారం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:41 PM

తన అద్భుత సంగీతంతో టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్‌ డైరక్టర్‌గా కొనసాగుతున్న రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మంచి గాయకుడన్న విషయం తెలిసిందే. బయటి మ్యూజిక్ డైరక్టర్స్‌తో పనిచేయనప్పటికీ.. తన అన్న సంగీత దర్శకత్వంలో పలు హిట్ చిత్రాలకు పాటలు పాడి, అవార్డులు సొంతం చేసుకున్నాడు సాగర్. అలాగే బుల్లితెర వ్యాఖ్యతగా, ఒకట్రెండు పాటలకు లిరిక్ రైటర్‌గా కూడా పనిచేశాడు. ఇదిలా ఉంటే తన అన్నలాగే మల్టీ టాలెంటెడ్ అనిపించుకోవాలనుకుంటున్న ఈ సింగర్.. ఇప్పుడు మరో అవతారం ఎత్తబోతున్నాడు. ఓ సినిమాకు మాటల రచయితగా మారబోతున్నాడు సాగర్.

తమిళ్‌లో విజయం సాధించిన ‘రాట్షసన్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా కనిపించనుంది. రమేశ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీ కోసం మాటలను రాయబోతున్నాడు సాగర్. మరి తన గాత్రంతో అందరినీ మెప్పించిన సాగర్.. మాటలతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.