Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • సీఎం అశోక్ గెహ్లాట్ ప్రతిపాదన అంగీకరించిన రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా. సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం పదవి సహా ఇద్దరు మంత్రుల పదవుల తొలగింపు. మంత్రి పదవులు కోల్పోయినవారిలో విశ్వేందర్ సింగ్, రమేశ్ మీనా. మంత్రి పదవులు కోల్పోయిన ఇద్దరూ పైటల్ వర్గం నేతలు.
  • అమరావతి: జీవో నెంబర్.3 పై సుప్రీంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వ. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ తరుపున రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశాం.
  • విశాఖ: టీవీ9 తో ఫైర్ సేఫ్టీ అధికారి రాం ప్రకాష్. ఈ ఘటనకు సంబంధించి రాత్రి విశాఖ సాల్వేట్స్ నుండి 10.40కి మెసేజ్ వచ్చింది. ఈ ప్రమాదాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం,ఎక్కువ అగ్ని స్ప్రీడ్ అవ్వకుండా ప్రమాదాన్ని నివరించగలిగాం . మానవ తప్పిదాలు వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతాయి. ఒకరు చేసే పొరపాటు వల్ల ఇండస్ర్టీకి చెడ్డపేరు వస్తోంది, మనం బాధ్యతగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం సంభవించదు.
  • అమరావతి: టిడిపి ఎమ్మెల్సిలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్ లపై మండలి ఛైర్మన్ వద్ద విచారణ. ఆరోగ్య కారణాల దృష్ట్యా విచారణ కి హాజరు కాని సునీత, శివనాథ రెడ్డి. వారి తరపున లాయర్లు హాజరు విచారణకు టీడీపీ తరపున హజరయిన పిటిషనర్ బుద్దా వెంకన్న, అశోక్ బాబు.
  • తిరుపతి: ఏపీ సీఎం కు ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. విధినిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదని లేఖలో పేర్కొన్న ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు.
  • శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను ఖండించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర. రాముడు భారతీయుల ఆరాధ్య దైవం. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడు. భారత్ లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పాడు శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలిసీ తెలియని మాటలు తగదు. -స్వరూపానంద

గాన కోకిలకు.. నేషనల్ అవార్డ్..!

Singer P Susheela wins the prestigious Kopparapu National Award, గాన కోకిలకు.. నేషనల్ అవార్డ్..!

ప్రముఖ సుప్రసిద్ధ గాయాని, గాన కోకిల పీ సుశీలను.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల.. సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటూంటే.. కోకిలే వచ్చి పాడిందా అన్నంత తీయగా వుంటుంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పాటలు పాడారు. ఇప్పటికే ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మ భూషణ్, సర్వాలయ ఏసుదాస్ పురస్కారాలు వచ్చాయి. కాగా.. ఇది సుశీలకి నాలుగో పురస్కారం. అలాగే.. సుశీలకు ‘గాన సరస్వతీ’, ‘గాన కోకిల’ అనే బిరుదులు కూడా ఉన్నావు.

కాగా.. వైజాగ్‌ కళాభారతి ఆడిటోరియంలో నేడు జరిగే.. కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో.. అతిరథ మహారథుల చేతుల మీదుగా.. ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి, సాంస్కృతిక శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బీజేపీ నేత మురళీధర రావు తదితరులు హాజరుకానున్నారు.

Singer P Susheela wins the prestigious Kopparapu National Award, గాన కోకిలకు.. నేషనల్ అవార్డ్..!

Related Tags