సింగరేణిలో సోలార్ పవర్… 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళిక… తొలిదశ ప్లాంట్ ప్రారంభం…

బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సింగ‌రేణి. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయంగా త‌రిగిపోని ఇంధ‌న వన‌రు అయిన సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. సింగ‌రేణి స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను శ‌ర‌వేగంగా ఏర్పాటు చేస్తోంది.

సింగరేణిలో సోలార్ పవర్... 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళిక... తొలిదశ ప్లాంట్ ప్రారంభం...
Follow us

|

Updated on: Nov 29, 2020 | 5:02 PM

బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సింగ‌రేణి. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయంగా త‌రిగిపోని ఇంధ‌న వన‌రు అయిన సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. సింగ‌రేణి స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను శ‌ర‌వేగంగా ఏర్పాటు చేస్తోంది.

సింగరేణి కాలరీస్‌ రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తోన్న 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో తొలిదశ 15 మెగావాట్ల ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సింగరేణి సంస్థ పలు ప్రాంతాల్లో తొలిదశలో 130 మెగావాట్ల ప్లాంట్లను నిర్మిస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 55 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం-3లో మిగిలిన 35 మెగావాట్లను, అలాగే ఖమ్మం జిల్లా ఇల్లందులో దాదాపుగా నిర్మాణం చివరి దశకు చేరిన 39 మెగావాట్ల ప్లాంట్లను ఈ డిసెంబరు నెలాఖరునాటికీ ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది.

అలాగే రెండో దశలో 90 మెగావాట్ల ప్లాంట్లతో పాటు మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల కాంట్రాక్టులను ఇప్పటికే అప్పగించింది. వీటి నిర్మాణం 2021 డిసెంబరు నాటికి పూర్తి చేసి విద్యుదుత్పాదన ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే సింగరేణికి ఏటా రూ.17 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని సమాచారం.