హైకోర్టు జడ్జి అయి ఉండి.. ఏంటో ఈ హైడ్రామా..! : సింధు

రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు. పెద్ద కుమార్తె రిషితను తనకు అప్పగించాలంటూ.. సెంట్రల్ జోన్ డీసీపీకి ఆదేశాలివ్వాలని సింధు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి అయి ఉండి ఎన్ని హైడ్రామాలు ఆడుతున్నారో అని సింధు వాపోయింది. సింధు తరపు లాయర్ వాదనలు విన్న కోర్టు సింధుతో పాటు ఆమె భర్త విశిష్ట, పెద్ద కుమార్తె రిషితను నేడు కోర్టులో హాజరు పరచాలని సెంట్రల్ డీసీపీని […]

హైకోర్టు జడ్జి అయి ఉండి.. ఏంటో ఈ హైడ్రామా..! : సింధు
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 1:51 PM

రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు. పెద్ద కుమార్తె రిషితను తనకు అప్పగించాలంటూ.. సెంట్రల్ జోన్ డీసీపీకి ఆదేశాలివ్వాలని సింధు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి అయి ఉండి ఎన్ని హైడ్రామాలు ఆడుతున్నారో అని సింధు వాపోయింది. సింధు తరపు లాయర్ వాదనలు విన్న కోర్టు సింధుతో పాటు ఆమె భర్త విశిష్ట, పెద్ద కుమార్తె రిషితను నేడు కోర్టులో హాజరు పరచాలని సెంట్రల్ డీసీపీని ఆదేశించింది.

కట్నం వేధింపులు తట్టుకోలేక సింధు న్యాయం కోసం రోడ్డెక్కింది. అదనపు కట్నం తేవాలని సింధును కొన్నేళ్లుగా వేధిస్తున్నారు. సింధు పోరాటానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. దీంతో చిన్న కుమార్తెను రామ్మోహన్ రావు ఫ్యామిలీ సింధుకు అప్పగించిందది. ఇప్పుడు పెద్ద కుమార్తె కోసం సింధు పోరాడుతోంది. చిన్న కూతుర్ని దక్కించుకున్న సింధు పెద్ద కుమార్తెను కూడా తన ఒడికి చేర్చుకోవాలని భరోసా సెంటర్‌కు వెళ్లింది. అక్కడ సింధుకు పెద్ద షాకే తగిలింది. భరోసా సెంటర్ దగ్గర హైడ్రామా నెలకొంది. సింధు చేతిలో ఉన్న పెద్ద కూతుర్ని లాక్కుని కారులో జంపయ్యాడు ఆమె భర్త వశిష్ట.