‘నాలుగు ప్రశ్నలకు సమాధానమివ్వండి నిర్మలాజీ ‘! కాంగ్రెస్

బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి […]

'నాలుగు ప్రశ్నలకు సమాధానమివ్వండి నిర్మలాజీ '! కాంగ్రెస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 29, 2020 | 5:26 PM

బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి ఉన్నత శాఖకు మంత్రి పదవిలో ఉన్న మీరే సమస్యను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది సరికాదని ఆయన ట్వీట్ చేశారు.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యా.. ఈ ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న సొమ్ముకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. వీరి నుంచి 2,780.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు మీరు ట్వీట్ చేశారని, అయితే 2002 మార్చి 16 న పార్లమెంటుకు సంబంధిత మంత్రి ఇఛ్చిన సమాధానంలో.. ఈడీ,… ఫెమా, పీఎంఎల్ఎ చట్టాల కింద ఐదేళ్లలో కేవలం 96.93 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారని ఆయన గుర్తు చేస్తూ… ఇందుకు సంబంధించిన న్యూస్ కటింగ్ ను కూడా తన ట్వీట్ కి జత చేశారు. అసలు 2014..15….2019..20 మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం 6,66,000 కోట్ల బ్యాంక్ రుణాలను ఎందుకు మాఫీ చేసిందని రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. ఈ నెల 24 న రిజర్వ్ బ్యాంకు ఆర్టీఐ కి ఇఛ్చిన రిప్లయ్ లో రూ.. 68,607 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు తెలిపింది. ఇది నిజమా? కాదా ? నీరవ్ మోదీ, మెహుల్  చోక్సీ , జతిన్ మెహతా, విజయ్ మాల్యాతో సహా మరికొందరి డీఫాల్టర్ల రుణాలను ప్రభుత్వం ఎందుకు మాఫీ చేసింది ? ఇందుకు ఎవరు అనుమతించారు ? అని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..